Car Loan Interest Cut: పండుగ సీజన్‌ను పురస్కరించుకొని ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన.. బ్యాంక్ ఆఫ్ బరోడా కారు లోన్ వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. ఇకపై కొత్త కారు లోన్లకు సంబంధించిన ఫ్లోటింగ్ రేటు లోన్‌పై వడ్డీ రేట్లు సంవత్సరానికి కనిష్ఠం 8.15 శాతం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది అంతకుముందు అమలులో ఉన్న 8.40 శాతం రేట్లతో పోల్చితే తక్కువగా మారింది. కొత్తగా తగ్గించిన వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ ప్రకటించింది. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్‌ను బట్టి వడ్డీ రేట్లు నిర్ణయించబడతాయని బ్యాంక్ పేర్కొంది.
Sugali Preethi : సుగాలి ప్రీతి కేసు.. పవన్ కల్యాణ్‌పై ఆరోపణలకు జనసేన గట్టి కౌంటర్
ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు దఫాల్లో మొత్తం 100 బేసిస్ పాయింట్లు అంటే1 శాతం రెపో రేట్లను తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాల తరువాత దేశంలోని ఎక్కువ శాతం బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే తాజా తగ్గింపు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక నిర్ణయంగా రేటు కోతలకు అదనంగా ఉంది.
కారు లోన్‌తో పాటు బ్యాంక్ బరోడా మార్టగేజ్ లోన్ (Loan Against Property) పైన కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 9.85 శాతం వార్షిక వడ్డీ వసూలు చేస్తూ వచ్చిన మార్గటేజ్ లోన్స్ ఇకపై 9.15 శాతం రేటుతో అందుబాటులో ఉంచినట్లు బ్యాంక్ వెల్లడించింది. ప్రజలు పండుగ సమయం కొత్త ప్రారంభాలకు శుభసమయమని భావిస్తారు కాబట్టి వారికి వడ్డీ రేట్ల తగ్గింపులు దోహదపడతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదళియార్ చెప్పారు. అలాగే ప్రాపర్టీపై రుణాలను కూడా తక్కువ వడ్డీతో అందించడం ద్వారా కస్టమర్లకు అదనపు నిధులను సమకూర్చుకునే అవకాశం కలుగుతుందన్నారు.
లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?
కారు లోన్ పొందాలనుకునే కస్టమర్లు బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫార్మ్ అయిన బరోడా డిజిటల్ కార్ లోన్ ద్వారా లేదా తమకు దగ్గరలోని బ్రాంచ్‌కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ స్థిర వడ్డీ రేటు కార్ లోన్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఇది 6 నెలల MCLRకి అనుసంధానించబడి 8.65 శాతం నుండి ప్రారంభమవుతుంది. దీంతో కారు కొనాలనుకుంటున్న వ్యక్తులకు బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్‌లు మరింత చౌకగా అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు.

