Banks Offering 8 percent for Regular Citizens: గ్యారెంటీ రాబడినిచ్చే సురక్షిత పెట్టుబడి మార్గంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు పేరుంది. అందుకే, ఎఫ్డీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఎఫ్‌డీ చేయడం ద్వారా మీ పెట్టుబడికి గ్యారెంటీ రిటర్న్స్ లభిస్తుంది. అంతేకాదు, ఎఫ్‌డీ వచ్చే ఆధాయానికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అయితే, బ్యాంకును బట్టి ఎఫ్టీ వడ్డీ రేట్లు మారుతుంటాయని గుర్తించుకోవాలి. కొన్ని బ్యాంకులు సాధారణ పౌరులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.05 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇది ఐదేళ్ల కాలానికి గరిష్టంగా రూ.3 కోట్ల వరకు ఉంటుంది. సాధారణ పౌరులకు ఏ ఏ బ్యాంకులు 8.05 శాతం వరకు ఎఫ్టీ వడ్డీ రేట్లను అందిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 8.05 శాతం వడ్డీ
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ పౌరులకు ఐదేళ్ల కాలపరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.05 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ పౌరులకు ఐదేళ్ల కాలపరిమితి గల ఎఫ్డీలపై 8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ పౌరులకు ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్టీలపై 7.25 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లోని డిపాజిట్లను డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) రూ.5 లక్షల వరకు బీమా చేసినప్పటికీ, ఇన్వెస్టర్లు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. వారి ప్రత్యేకమైన వ్యాపార నమూనాను బట్టి, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.
ఎఫ్డీ ఆధాయంపై పన్ను మినహాయింపు..
ఒక నిర్దిష్ట బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్డీ) నుండి వడ్డీ రూ.లక్ష దాటితే బ్యాంకులు టీడీఎస్‌ను తీసివేయాలి. టీడీఎస్ అదనపు పన్ను కాదు. మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసినప్పుడు దాన్ని తిరిగి వాపసుగా దీన్ని పొందవచ్చు. అంతేకాకుండా, మీరు టాక్స్ రిటర్న్‌కు అర్హులైతే, మీరు ఆ రిటర్న్‌పై లభించే వడ్డీకి కూడా అర్హులు కావచ్చు. ఉదాహరణకు మీకు ఏటా రూ. 11 లక్షల ఆదాయం ఉంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A పన్ను రాయితీ లభిస్తుంది. ఈ కారణంగా మీరు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు అమల్లో ఉంది. మీ ఆదాయానికి సెక్షన్ 87A పన్ను రాయితీ వర్తిస్తుంది.


