Saturday, November 15, 2025
Homeబిజినెస్Best 125cc Bikes: తక్కువ జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 125సీసీ బైక్స్..మెయింటెనెన్స్ తక్కువ,...

Best 125cc Bikes: తక్కువ జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 125సీసీ బైక్స్..మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ ఎక్కువ!

Top 125cc Bikes: జీఎస్టీ తగ్గింపు తర్వాత ఇండియాలో 125cc విభాగంలో బైక్‌లను కొనుగోలు చేయడం గతంలో కంటే మరింత సరసమైనదిగా మారింది. ఇది చాలా రోజుల నుంచి కొత్త బైక్ కొనాలనుకునేవారికి నేరుగా ప్రయోజనాన్ని చేకూర్చింది. ఈ నేపథ్యంలో మార్కెట్లో తక్కువ ధరకు మాత్రమే కాకుండా, తక్కువ మెయింటనెన్స్ కు ప్రసిద్ధి చెందిన ఐదు 125cc బైక్‌ల గురించి మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

- Advertisement -

TVS Raider 125

ఈ జాబితాలో మొదటి బైక్ TVS రైడర్. ఇది స్పోర్టీ డిజైన్‌తో ఆధునిక ఫీచర్లను ఇష్టపడే వారి ఉత్తమ ఎంపిక అవుతుంది. TVS రైడర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.80,500. ఈ బైక్ 124.8cc, 3-వాల్వ్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది 11.2 bhp శక్తిని, 11.2 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

Honda Shine

హోండా షైన్ ఇండియాలో 125cc విభాగంలో ప్రజాదరణ పొందిన బైక్. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధరలు రూ.78,538 (ఎక్స్-షోరూమ్) నుండి డిస్క్ వేరియంట్ ధరలు రూ.82,898 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. ఈ బైక్ 123.94cc ఇంజిన్ 10.59 bhp, 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హోండా షైన్ బైక్ లీటర్‌కు దాదాపు 55-65 kmpl మైలేజ్ ని అందిస్తుంది.

also read:Samsung Galaxy S25 Ultra Discount: ఇది కదా డిస్కౌంట్..ఈ శామ్‌సంగ్ ఫోన్ పై ఏకంగా రూ.వేలల్లో తగ్గింపు!

Honda SP 125

స్టైలిష్‌, ఆధునిక లక్షణాలతో వచ్చే బైక్ చూస్తుంటే, హోండా SP 125 బెస్ట్ ఆప్షన్. ఈ బైక్ ధరలు ఇప్పుడు రూ.85,564 నుండి ప్రారంభమవుతాయి(GST తగ్గింపు తర్వాత). దీని 123.94cc ఇంజిన్ 10.72 bhp, 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.

Bajaj Pulsar 125

నాల్గవ బైక్ బజాజ్ పల్సర్ 125 బైక్. ఈ బైక్ స్టైలిష్ గా ఉంటుంది. దీని సరసమైన ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ 124.4cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 11.8 PS గరిష్ట శక్తిని, 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. జీఎస్టీ తర్వాత ఈ బైక్ ధరలు రూ.77,295 నుండి ప్రారంభమవుతాయి.

Hero Glamour X125

హీరో గ్లామర్ X125 స్టైలిష్, శక్తివంతమైన 125cc కమ్యూటర్ బైక్. ఈ బైక్ 124.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 11.5 PS శక్తిని, 10.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ధరలు రూ.80,510 ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad