Big Bang Diwali Sale in Flipkart: దసరా పండుగ సందర్భంగా ఆఫర్ల వర్షం కురిపించిన ఈ-కామర్స్ సైట్లు దీపావళి సమీపిస్తుండటంతో మరోసారి భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి డీల్ పేరుతో మరో సేల్ నిర్వహిస్తోంది. అంతేకాదు, ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అధిరిపోయే డీల్స్ తీసుకొస్తోంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా ప్రతి నాలుగు గంటలకోసారి దిమ్మదిరిగే డిస్కౌంట్లు, కాంబో ఆఫర్లతో కొత్త ప్రోడక్ట్స్‌ను పరిచయం చేస్తోంది. అంతేకాదు, ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు తెస్తూ యూజర్లను ఫ్లిప్‌కార్ట్ సైట్‌కు అతుక్కుపోయేలా చేస్తుంది. ఈ మారథాన్ సేల్‌లో ప్రకటించిన ఆఫర్లపై ఓలుక్కేద్దాం.
వీటిపై 70 శాతం వరకు డిస్కౌంట్..
మారథాన్ సేల్‌లో టెక్నికల్ ప్రోడక్ట్స్, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ, కిడ్స్ ప్రోడక్ట్స్ అన్ని ప్రధాన కేటగిరీల్లో 70 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రతి కేటగిరీకి ప్రత్యేకమైన డీల్స్ ఉండటం వల్ల, మీకు నచ్చిన ప్రోడక్ట్స్ తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఇక, భారీ ఆఫర్లతో పాటు ఎస్‌బీఐ యూజర్ల కోసం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక బోనస్‌ను కూడా అందిస్తోంది. ఎస్‌బిఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లపై అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
గంట గంటలకు స్పెషల్ ఆఫర్లు..
మారథాన్ సేల్‌లో ప్రతి కేటగిరీకి ప్రత్యేక టైమింగ్ ఉంటుంది. ఉదాహరణకు, ఫ్యాషన్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 వరకు, హోమ్ అప్లయన్సెస్ సాయంత్రం 6 నుండి రాత్రి 10 వరకు, రాత్రి 10 నుండి అర్ధరాత్రి వరకు ప్రత్యేక క్విక్ డీల్‌ల కోసం టైమ్ స్లాట్లు ఉంటాయి. అయితే, ఈ డీల్స్ లిమిటెడ్ స్టాక్‌తో వస్తాయి. ఈ డీల్స్‌ను పట్టేయాలంటే ఎప్పటికప్పుడు సైట్‌ను చూస్తూ ఉండాలి. దివాళికి ముందు ప్రోడక్ట్స్ లిస్ట్ తయారు చేసుకొని, ప్రతి నాలుగు గంటలకు కొత్త డీల్‌లను చూసి కొనుగోలు చేస్తే, తక్కువ ధరకే వీటిని పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ డీల్‌లో కాంబో ఆఫర్స్..
ఇంకా, ఫ్లిప్‌కార్ట్ డీల్‌లో కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. వేర్వేరు ప్రోడక్ట్స్‌ను కాంబోలో తీసుకోవడం ద్వారా, మీరు మరింత ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. ఉదాహరణకు, ఫ్యాషన్ కిట్, బ్యూటీ ప్రోడక్ట్, గ్యాడ్జెట్ కిట్‌లను ఒకేసారి కొనుగోలు చేస్తే, అదనపు రాయితీలు కూడా పొందవచ్చు. అందుకే, సరైన సమయం, సరైన ప్రోడక్ట్, సరైన డిస్కౌంట్ ఈ మూడు మీ చేతుల్లో ఉండాలంటే, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి డీల్ మారథాన్‌తో దీపావళి షాపింగ్‌ను మరింత ప్రత్యేకంగా జరుపుకోండని సంస్థ చెబుతోంది. చేసుకోండి.


