Big shock for SBI credit card users: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐకి చెందిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు తమ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. లేట్ పేమెంట్ ఛార్జీల నిర్మాణంలో సంస్థ కీలక మార్పులు చేసింది. మే 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు ముఖ్యంగా చిన్న మొత్తాల బకాయిలు ఉన్న వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, రూ.500 లోపు బకాయిలపై ఎలాంటి లేట్ ఫీజు లేదు. అయితే, ఇప్పుడు ఆ సదుయంలో కొన్ని మార్పులు తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, రూ.100 నుంచి రూ.500 మధ్య బకాయి ఉంటే ఇకపై రూ.100 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, రూ.500 నుంచి 1,000 మధ్య బకాయిపై లేట్ ఛార్జీ రూ.400 నుంచి రూ.500కు పెరిగింది. అయితే రూ.1,000కు పైబడిన బకాయిలకు సంబంధించిన ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీని వల్ల ప్రధానంగా చిన్న బిల్లులు చెల్లించడంలో ఆలస్యం చేసే వినియోగదారులపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అంతేకాకుండా వరుసగా రెండు బిల్లింగ్ సైకిళ్లలో ‘మినిమమ్ అమౌంట్ డ్యూ’ (ఎంఏడీ) కూడా చెల్లించకపోతే అదనంగా రూ.100 పెనాల్టీ విధించనున్నారు. ఈ ఛార్జీ బకాయి పూర్తిగా క్లియర్ చేసే వరకు ప్రతి సైకిల్‌కు ఈ పెనాల్టీ వర్తించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్‌లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారుల చెల్లింపుల క్రమశిక్షణ పెంచడమే లక్ష్యంగా ఎస్‌బీఐ కార్డ్ ఈ కీలక మార్పులు చేసింది.
Also Read: https://teluguprabha.net/national-news/vijay-gives-up-trichy-east/

