Sunday, November 16, 2025
Homeబిజినెస్Emmanuel: అప్పుడు సంజన కోసం త్యాగం.. ఇప్పుడు తనూజతో పోటీ

Emmanuel: అప్పుడు సంజన కోసం త్యాగం.. ఇప్పుడు తనూజతో పోటీ

Emmanuel:  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగింది. ఫైనల్ రౌండ్‌ వరకు సస్పెన్స్ నింపిన ఈ టాస్క్‌లో చివరికి ఇమ్మాన్యుయెల్ విజేతగా నిలిచి కెప్టెన్ కిరీటం దక్కించుకున్నాడు. ఈసారి బిగ్ బాస్ పెట్టిన “దొంగల టాస్క్” ఆసక్తికరంగా సాగింది. ఇందులో హౌస్‌మేట్స్‌ తమ శక్తి, స్ట్రాటజీ, మరియు స్మార్ట్‌నెస్‌ చూపించాల్సి వచ్చింది. ఫైనల్ రౌండ్‌లో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్లు అమర్ దీప్, అర్జున్ అంబటి హంగామా చేశారు. ఆ సీజన్ లో చేసినట్టుగానే సర్కిల్‌లో బోన్ పట్టుకుని చివరి వరకు నిలబడే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో చివరి వరకూ ధైర్యంగా నిలిచి బోన్‌ను విడవకుండా పట్టుకున్న ఇమ్మాన్యుయెల్‌నే బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్‌గా ప్రకటించాడు. అయితే, ఈ పోటీలో తనూజ, ఇమ్మూ చివరి వరకు నిలవగా.. ఆఖరికి ఇమ్మూయే కెప్టెన్ అయ్యాడు.

- Advertisement -

Read Also: Bigg Boss Elimination: పికిల్స్ పాప బ్యాగ్ ప్యాక్ చేసుకోవాల్సిందే.. లీస్ట్ లో ఆమెనే..!

గతంలో కెప్టెన్ గా..

ఇప్పటికే ఒకసారి కెప్టెన్‌గా వ్యవహరించిన ఇమ్మాన్యుయెల్, రెండోసారి కూడా కెప్టెన్‌గా మారడం గమనార్హం. ఈ సీజన్‌లో అతని గేమ్‌ప్లే, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కామెడీతో హౌస్‌లో ఎంటర్టైన్ చేయడమే కాకుండా, టాస్కుల్లో తన ఫోకస్ చూపిస్తూ బలమైన కంటెస్టెంట్‌గా ఎదిగాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇమ్మాన్యుయెల్ దగ్గర ఉన్న పవర్ అస్త్రం ఈ వారం అతనికి అదనపు బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. గతంలో రామును సేఫ్ చేయడానికి ఆ పవర్ ఉపయోగించాలనుకున్నా, అప్పటికే రాము సేఫ్ కావ‌డంతో ఆ ప్లాన్ ఫలించలేదు. అయినప్పటికీ, ఆ పవర్ అస్త్రం ఇమ్మాన్యుయెల్ గేమ్‌లో కీలకమైన టర్న్‌గా మారింది.

Read Also: Bigg Boss Captain: నిన్న అయేషా.. నేడు తనూజ.. హౌస్ లో ఏం జరుగుతోంది?

హౌస్ లో తనకంటూ స్థానం

ఇకపోతే, బిగ్ బాస్ హౌస్‌లో తన స్థానం బలపరుచుకుంటూ, ప్రేక్షకుల మనసుల్లోనూ ఇమ్మాన్యుయెల్ చోటు సంపాదించుకుంటున్నాడు. అయితే, ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి ఇమ్మాన్యుయెల్.. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకడిగా కనిపిస్తున్నాడు. అయితే, సీజన్ ముగింపు దశకు చేరుతుండగా, ఈ కామెడీ కింగ్ తన కెప్టెన్సీతో ఆటను ఇంకాస్త సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్తాడా లేదా అనేది చూడాలి. అంతేకాకుండా, ఈసీజన్ లో ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad