BSNL 4G Launched: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLపై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఎట్టకేలకు నెరవేరాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం BSNL 4G సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. దీని ద్వారా 90 మిలియన్లకు పైగా BSNL వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు అత్యుత్తమ సేవలను పొందనున్నారు. అంతేకాకుండా, ఈ 4G నెట్‌వర్క్ 5Gకి సిద్ధంగా ఉన్నందున, ఈ సంవత్సరం చివరి నాటికి 5G సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ శుభవార్తతో పాటు, BSNL తన వినియోగదారుల కోసం మార్కెట్‌లో ఉన్న మిగతా సంస్థల కంటే చౌకైన ప్లాన్‌లను ప్రకటించింది.
BSNL 4G: ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లు
BSNL అందిస్తున్న ప్లాన్‌లలో అత్యంత సరసమైనది కేవలం రూ. 107 రీఛార్జ్. ఇది పూర్తి 28 రోజుల చెల్లుబాటును ఇస్తుంది. సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. ఈ ప్లాన్‌లో 200 నిమిషాల వాయిస్ కాల్స్, 3GB డేటా లభిస్తాయి.
మరో ఆకర్షణీయమైన ప్లాన్ రూ. 153. దీని ద్వారా వినియోగదారులు 25 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్, రోజుకు 1GB డేటా, 100 SMSలను పొందవచ్చు. ఈ ప్లాన్ ఢిల్లీలోని MTNL ప్రాంతంలో కూడా పనిచేస్తుంది.
పోటీదారులైన జియో, ఎయిర్‌టెల్, Vi కంటే చౌకగా ఉన్న ప్లాన్ రూ. 199. కేవలం రూ. 199కే 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 2GB డేటా, 100 SMS సందేశాలు అందుతాయి.
New York : డబ్బులు ఎలా సంపాదించాలో ఈమెను చూసి నేర్చుకోవాలి
BSNLలో కొత్తగా చేరాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ ఒక ప్రత్యేక ఆఫర్‌గా రూ. 249 రీఛార్జ్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో ఏకంగా 45 రోజుల చెల్లుబాటు, రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్ ప్రయోజనాలు లభిస్తాయి.
దీర్ఘకాలిక వ్యాలిడిటీ కోసం చూస్తున్న వారికి రూ. 1499 ప్లాన్ అద్భుతమైన ఎంపిక. ఇది 336 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS, మొత్తం 24GB డేటాను అందిస్తుంది. ఇక పూర్తి సంవత్సరం (365 రోజులు) వ్యాలిడిటీ కావాలంటే రూ. 2399 ప్లాన్ ఉంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా (తర్వాత వేగం తగ్గుతుంది), అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు అందుతాయి.
ఈ చారిత్రాత్మక 4G ప్రయోగం, చౌకైన ప్లాన్‌లతో BSNL భారత టెలికాం మార్కెట్‌లో మళ్లీ బలమైన పోటీని ఇచ్చేందుకు సిద్ధమైందని స్పష్టం చేస్తోంది.


