Saturday, November 15, 2025
Homeబిజినెస్BSNL Plan: బీఎస్ఎన్ఎల్ 5మంత్స్ ప్లాన్..!

BSNL Plan: బీఎస్ఎన్ఎల్ 5మంత్స్ ప్లాన్..!

BSNL: భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో మరియు ఎయిర్టెల్‌కి పోటీగా ఓ కొత్త డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.997 ధరతో అందుబాటులో ఉన్న ఈ ప్లాన్‌ వినియోగదారులకు మొత్తం 160 రోజుల చెల్లుబాటు కాలం లభిస్తుంది. ఇది సుమారు 5 నెలల సమానమైనదిగా ఉంటుంది. ఈ ప్లాన్‌ను సంస్థ స్వయంగా తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో ప్రకటించింది.

- Advertisement -

ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ల  పంపిణీ సౌకర్యం కూడా కల్పించబడుతోంది. మొత్తంగా, ఈ ప్లాన్ వినియోగదారులకు డేటా, కాలింగ్, మెసేజింగ్ సేవలన్నింటినీ సమతుల్యంగా అందిస్తోంది.

Readmore: https://teluguprabha.net/business/gold-and-silver-prices-updates-today-various-cities-in-india/

ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే, ప్రస్తుతానికి జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు ఇలా తక్కువ ధరలో ఎక్కువ కాలపరిమితి కలిగిన ప్లాన్‌ను అందించడం లేదు. దీని వల్ల ఎక్కువ కాలపరిమితి కోరుకునే వినియోగదారులకు ఇది మంచి అవకాశం. ఈ ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ తిరిగి మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనెక్టివిటీ మరియు సేవల నాణ్యతను మెరుగుపరుస్తూ, వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది.

Readmore: https://teluguprabha.net/business/airtel-introduces-new-1-rupee-plan/

బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ఇతర ప్లాన్లతో పోలిస్తే ఎక్కువ కాలం చెల్లుబాటుతో వస్తోంది. ధర పరంగా తేడా ఎక్కువగా లేకపోయినా, ప్లాన్ పొడవైన చెల్లుబాటు మరియు బేసిక్ అవసరాలను తీర్చే పరంగా ఇది వినియోగదారులకు మంచి ఎంపికగా కనిపిస్తోంది. జియో అదనంగా 20GB డేటా అందిస్తుండగా, ఎయిర్టెల్ ఎక్కువ ప్లే టైమ్ కలిగిన డేటా కోసం అనుకూలంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad