Saturday, November 15, 2025
Homeబిజినెస్BSNL: జియో, ఎయిర్ టెల్ లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్..!

BSNL: జియో, ఎయిర్ టెల్ లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్..!

BSNL: జియో, ఎయిర్ టెల్ భారతదేశ టెలికాం రంగంలో ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నాయి. జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను పెంచుతూ, కనీస రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను సవరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ అందించింది. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ. 147కే నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని వలన బీఎస్ఎన్ఎల్ 1.5 GB/రోజు ప్లాన్ జియో, ఎయిర్‌టెల్, వీఐ రూ. 299 ఎంట్రీ ప్యాక్‌ల కంటే 52% చౌకగా ఉంటుంది. బడ్జెట్‌పై శ్రద్ధ చూపే యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపే మొగ్గు చూపే ఛాన్స్ కన్పిస్తుంది.

- Advertisement -

 ప్లాన్ ఏంటంటే?

ఈ ప్లాన్ వివరాల్లోకి వెళ్తే, రూ. 147 తో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ నెల రోజుల పాటు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు 10 జీబీ హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తున్నారు. రోజుకు సుమారు ఐదు రూపాయల ఖర్చుతో వినియోగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో ఒక పరిమితి ఉంది. కేటాయించిన 10 జీబీ డేటా వినియోగం పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అందువల్ల, అధికంగా ఇంటర్నెట్ వాడే వారికి ఈ ప్లాన్ అంతగా సరిపోకపోవచ్చు. కానీ, ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ, పరిమితంగా డేటా వాడే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలుస్తుంది. పెరుగుతున్న రీఛార్జ్ ధరల నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

Read Also: Delhi Metro: ఢిల్లీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. మెట్రో ఛార్జీల పెరుగుదల

టెలికాం కంపెనీల బేస్ ప్యాకేజీలు

బీఎస్ఎన్ఎల్:  రూ.141 ప్యాక్ (రోజుకు 1.5 GB, 30 రోజులు) రూ.148 ప్యాక్ (రోజుకు 2.2 GB, 30 రోజులు)

జియో: రూ.299 (రోజుకు 1.5 GB, 28 రోజులు), రూ. 349 (రోజుకు 2 GB, 28 రోజులు)

ఎయిర్‌టెల్: రూ.299 (రోజుకు 1 GB, 28 రోజులు), రూ. 349 (రోజుకు 1.5 GB, 28 రోజులు)

వొడాఫోన్: రూ. 299 (రోజుకు 1 GB, 28 రోజులు), ₹రూ. 49 (రోజుకు 1.5 GB, 28 రోజులు), రూ. 408 (రోజుకు 2 GB, 28 రోజులు)

Read Also: De Villiers: ఐపీఎల్ లోకి మిస్టర్ 360 రీఎంట్రీ.. ఆర్సీబీగా కోచ్ గానా?

టెలికాం సంస్థల మధ్య పోరు..

ఆగస్టు 18 నుండి రిలయన్స్ జియో తన ఎంట్రీ లెవల్ రూ.249 ప్లాన్ (రోజుకు 1 GB, 28 రోజులు)ను నిలిపివేసింది. దీంతో, యూజర్లు అధిక ప్యాక్‌లకు అప్‌గ్రేడ్ చేయవలసి వచ్చింది. మరోవైపు, జియో తన చౌకైన ప్లాన్‌ను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్‌ పెరిగాయి. దాదాపు 2.84% స్టాక్ట్ పెరిగినట్లు కథనాలు వస్తున్నాయి. టెలికాం రంగంలో జియో, ఎయిర్ టెల్ సబ్ స్క్రైబర్లను పెంచుకుంటూ పోతున్నాయి. జూన్ 2025లో జియోకు 1.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లు ఉండగా.. ఎయిర్‌టెల్ 7,63,482 మందిని సబ్ స్క్రైబర్లుగా పొందింది. వీఐ మాత్రం  2, 17,816 మందిని కోల్పోయిందని ట్రాయ్ (TRAI) డేటా చూపిస్తుంది. ప్రీమియమైజేషన్, టారిఫ్ పెంపుదల మద్దతుతో ఎయిర్‌టెల్ ఆదాయ మార్కెట్ వాటా 40%కి చేరుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad