Saturday, November 15, 2025
Homeబిజినెస్Room Heater Offers: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. శీతాకాలంలో రూమ్‌ను వేడిగా మార్చే ఈ 5...

Room Heater Offers: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. శీతాకాలంలో రూమ్‌ను వేడిగా మార్చే ఈ 5 హీటర్లపై ఓలుక్కేయండి..!

Bumper Offrs on Room Heater Offers in Amazon: అప్పుడే శీతాకాలం వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ఉదయం ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఈ శీతాకాలంలో రూమ్‌ను వేడిగా మార్చుకోవాలని చాలా మంది అనుకుంటారు. అటువంటి వారి కోసం ఆన్‌లైన్‌‌లో మంచి రూమ్ హీటర్లు చాలా అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ రూమ్‌ హీటర్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కేవలం రూ.15 వేలోపే అమెజానలో 5 అద్భుతమైన హాటర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

- Advertisement -

ఓరియంట్‌ ఎలక్ట్రిక్‌ అరెవా

ఓరియంట్ ఎలక్ట్రిక్ అరెవా 2000W పవర్ అవుట్‌పుట్‌తో కూడిన పోర్టబుల్ రూమ్ హీటర్. ఇది రెండు హీటింగ్ మోడ్‌లు, అధునాతన ఓవర్‌హీట్ ప్రొటెక్షన్‌ను అందిస్తుంది. కంపెనీ ఏడాది రీప్లేస్‌మెంట్ వారంటీని కూడా అందిస్తుంది. ఓరియంట్ ఎలక్ట్రిక్ అరెవా అసలు ధర అమెజాన్‌లో రూ.3,590 ఉండగా.. అమెజాన్‌లో దీన్ని 61% డిస్కౌంట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆఫర్‌ కింద దీన్ని కేవలం రూ.1,399 వద్ద కొనుగోలు చేయవచ్చు.

హావెల్స్‌ కోజియో న్యూ రూమ్‌ హీటర్‌

ఈ హీటర్‌ ఎలాంటి సౌండ్ లేకుండా గదిని హీట్ చేస్తుంది. ఇందులో యాంటీ-రస్ట్ రిఫ్లెక్టర్లు కూడా ఉంటాయి. కంపెనీ ఈ ప్రొడెక్టుపై 2 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది. దీనికి డ్యూయల్ హీట్ సెట్టింగ్‌లు కూడా ఉన్నాయి. హావెల్స్ కోజియో నువో అసలు ధర రూ. 2099 ఉండగా.. 37% డిస్కౌంట్‌తో దీన్ని కేవలం రూ. 1325 వద్ద కొనుగోలు చేయవచ్చు.

సోలిమో 2000 వాట్స్‌ రూమ్‌ హీటర్‌

అమెజాన్ సొంత బ్రాండ్ సోలిమో 2000 వాట్స్‌ రూమ్‌ హీటర్‌ కూడా అత్యంత తక్కువ ధరకే లభిస్తుంది. అడ్జస్ట్‌మెంట్ చేయగల థర్మోసెట్‌ను కలిగి ఉంటుంది. ఈ రూమ్ హీటర్ ఐఎస్‌ఐ సర్టిఫైడ్‌తో వస్తుంది. ఇది చిన్న గదులకు సరిగ్గా
సరిపోతుంది. దీని అసలు ధర రూ.2000 వద్ద ఉండగా.. ఆఫర్‌లో భాగంగా దీన్ని కేవలం రూ. 879 వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఆర్పాట్‌ ఓఈహెచ్‌-1220 2000 వాట్స్‌ ఫ్యాన్‌ హీటర్‌

ఆర్పాట్ ఓఈహెచ్‌-1220 రూమ్ హీటర్ 2000W పవర్ అవుట్‌పుట్‌తో వస్తుంది. ఈ ఫ్యాన్ హీటర్ మధ్య తరహా గదికి వేడిని అందించడానికి బెస్ట్ ఆప్షన్‌. దీని ధర రూ.1295 ఉండగా.. ఇప్పుడు అమెజాన్‌లో 5% డిస్కౌంట్‌తోరూ.1232 వద్ద కొనుగోలు చేయవచ్చు.

క్రాంప్టన్‌ కాంఫీ ప్లస్‌ 800 వాట్స్‌ క్వార్ట్జ్‌ రూమ్‌ హీటర్‌

క్రాంప్టన్ కాంఫీ ప్లస్ 800W పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. ఇది రెండు హీట్ సెట్టింగ్‌లను అందిస్తుంది. పోర్టబుల్, క్యారీయింగ్ హ్యాండిల్‌తో వస్తుంది. దీనికి నియాన్ లాంప్ ఇండికేటర్ కూడా అందించారు. దీని అసలు ధర రూ. 2,300 కాగా 48% డిస్కౌంట్‌తో కేవలం రూ.1,199 వద్ద కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad