Saturday, November 15, 2025
Homeబిజినెస్BYD Atto 2: భారత్ లో లాంఛ్ కు సిద్ధంగా బీవైడీ అట్టో 2..!

BYD Atto 2: భారత్ లో లాంఛ్ కు సిద్ధంగా బీవైడీ అట్టో 2..!

BYD Atto 2: చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బీవైడీ భారతదేశంలో తన ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని మరింత విస్తరించేందుకు రెడీ అయ్యింది. అట్టో 3, సీల్, ఈమాక్స్ 7, సీలయన్ వంటి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసిన తర్వాత.. ఇప్పుడు బీవైడీ అట్టోపై దృష్టిపెట్టింది. బీవైడీ అట్టో 2 ఎలక్ట్రిక్ ఎస్ యూవీని ఇండియాలో లాంచ్​ చేసేందుకు సిద్ధమైంది. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ప్రస్తుతం భారత రోడ్ల మీద ఆ కంపెనీ టెస్టింగ్​ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను కనుక్కుందాం. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఇప్పటికే యూకే మార్కెట్‌లో అందుబాటులో ఉంది. కారును పూర్తిగా కవర్‌తో కప్పి ఉంచినప్పటికీ, వెనుక లైట్లు, సైడ్​ భాగం ఆధారంగా ఇది అట్టో 2 అని గుర్తించవచ్చు.

- Advertisement -

Read Also: Gold Rates: బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..!

యూకేలో ధర ఎంతంటే?
యూకేలో బీవైడీ అట్టో 2 ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర 30,850 పౌండ్లు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 32.50 లక్షలు. స్వల్ప మార్పులతో భారతదేశంలోకి వస్తే, దీని ధర రూ. 35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.

బ్యాటరీ, పనితీరు

ఒకవేళ యూకేలో విడుదలైన యూరో-స్పెక్ బీవైడీ అట్టో 2ను భారతదేశంలోకి తీసుకొస్తే, ఇందులో 45 కిలోవాట్-అవర్ సామర్థ్యం గల బీవైడీ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే డబ్ల్యూఎల్​టీపీ ప్రకారం 463 కిలోమీటర్ల వరకు రేంజ్​ని సంస్థ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 174 బీహెచ్‌పీ పవర్​ని, 290 ఎన్​ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 7.9 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు.

Read Also: DRDO: భారత రక్షణ శాఖ అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం..!

స్పెషల్ ఫీచర్లు

డిజైన్ పరంగా, బీవైడీ అట్టో 2 ముందు భాగం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవిలోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో ‘మోబియస్ రింగ్’ కనెక్టెడ్ ఎల్​ఈడీ టెయిల్ లైట్లు, ఎన్​ఎఫ్​సీ కీ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, అల్యూమినియం రూఫ్ రైల్స్, విద్యుత్ ద్వారా మడిచే ఓఆర్​వీఎంలు, వర్షం పడినప్పుడు ఆటోమేటిక్‌గా పనిచేసే వైపర్లు ఉన్నాయి.

భారత్‌లో పోటీదారులు

గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య పెరుగుతోంది. ఈ మార్కెట్‌లో బీవైడీ అట్టో 2కు సులభంగా విజయం లభించడం కష్టమే! ఒకవేళ ఈ కారు సుమారు రూ. 35 లక్షల ధరతో వస్తే ఇది టాటా హారియర్ ఈవీ, మహీంద్రా ఎక్స్​ఈవీ 9ఈ వంటి మోడళ్లతో తీవ్రంగా పోటీ పడనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad