CBI raids Anil Ambani’s office: ప్రముఖ పారిశ్రామికవేత్త, అపర కుభేరుడు ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలైన రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లపై గతంలో నమోదైన కేసులకు సంబంధించి ఈ సోదాలు జరిపినట్లు సమాచారం. అనిల్ అంబానీపై నమోదైన బ్యాంక్ మోసం కేసులో ముంబయిలోని ఆయనకు సంబంధించిన 17 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం తెలిపింది. కంపెనీల డైరెక్టర్ల నివాసాలు మధ్యవర్తిత్వం వహించిన సంస్థల కార్యాలయాల్లోనూ సోదాలు జరుపుతున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. ఒకే చిరునామా నుంచి పలు మధ్యవర్తి కంపెనీలు పనిచేస్తున్నట్లు గుర్తించామని.. దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌పై ఇప్పటికే ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఇప్పటికే పలుమార్లు అనిల్ అంబానీ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. దీంతో, ఈ పరిణామం వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Also read: https://teluguprabha.net/telangana/bandi-sanjay-son-in-pocso-case/

