Best CNG Cars: ఇంధన ధరలు పెరుగుతునందున్న చాలమంది సిఎన్‌జి కార్ల కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా పెట్రోల్ సమస్య తగ్గించుకుని, 6-7 లక్షల బడ్జెట్‌లో కొత్త, చవకైన సిఎన్‌జి కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీ కోసమే. మార్కెట్లో మంచి మైలేజీతో పాటు ఆధునిక ఫీచర్లతో అనేక సిఎన్‌జి కార్లు ఉన్నాయి. దేశంలోనే అత్యంత చవకైన 5 CNG కార్ల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
MarutiS-Presso CNG
ఈ సిఎన్‌జి కార్ల జాబితాలో మొదటి కారు మారుతి S-ప్రెస్సో సిఎన్‌జి. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.4.62 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇది 1.0L K-సిరీస్ పెట్రోల్-సిఎన్‌జి ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది 56 PS శక్తిని, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 32.73 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ESP, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది.
Maruti Alto K10 CNG
మారుతి ఆల్టో K10 సిఎన్‌జి ధర రూ.4.82 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది 998cc K10C ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 56 PS పవర్, 82.1 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 33.85 km/kg మైలేజ్ అందిస్తుంది. సెఫ్టి కోసం ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లును కలిగి ఉంది. ABS, EBD, ESP, వెనుక సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, 214 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. ఈ కారు ముఖ్యంగా చిన్న కుటుంబాలుకు అనుకూలంగా ఉంటుంది.
Tata Tiago CNG
టాటా టియాగో సిఎన్‌జి ధర రూ.5.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 72 PS పవర్, 95 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని మైలేజ్ 26.49 km/kg (మాన్యువల్), 28.06 km/kg (AMT). ఈ కారు 4-స్టార్ GNCAP భద్రతా రేటింగ్‌తో వస్తుంది. ఇది అత్యంత సురక్షితమైన బడ్జెట్ కార్లలో ఒకటిగా నిలిచింది.
Maruti Wagon R CNG
మారుతి వ్యాగన్ R సిఎన్‌జి రూ.5.89 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. ఇది 56 PS శక్తిని, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 998cc K10C ఇంజిన్‌తో శక్తినిస్తుంది. దీని మైలేజ్ 34.05 km/kg అందిస్తుంది. ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESP, వెనుక సెన్సార్లు, హిల్ హోల్డ్ వంటి భద్రతా ఫీచర్లతో వస్తుంది.
Maruti Celerio CNG
మారుతి సెలెరియో సిఎన్‌జి ధర రూ.5.98 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది 56 PS శక్తిని, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 998cc K10C ఇంజిన్‌తో శక్తినిస్తుంది. దీని ఇంధన సామర్థ్యం 34.43 km/kg. ఇది భారతదేశంలో అత్యంత ఇంధన-సమర్థవంతమైన సిఎన్‌జి కారుగా నిలిచింది. సెలెరియో ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, ESP, వెనుక సెన్సార్లు, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, కీలెస్ ఎంట్రీ, ఆటో AC వంటి ఫీచర్లతో వస్తుంది. తక్కువ ధరకే అధిక మైలేజ్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.


