Homeబిజినెస్Stock markets: ముడి చమురు సెగ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

Stock markets: ముడి చమురు సెగ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

Crude oil effect: భారతీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌ను అత్యంత భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొంది. దీని ప్రభావంతో దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి.

- Advertisement -

కుప్పకూలిన సూచీలు: ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 2182 పాయింట్లు పతనమై ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేసింది. నిఫ్టీ 659 పాయింట్ల భారీ నష్టంతో ట్రేడ్ అవుతోంది.

Also read-JioStar: వ్యూవర్‌షిప్‌లో జియోస్టార్ రికార్డు.. యాడ్స్ రేట్లలోనూ సరికొత్త బెంచ్‌మార్క్!

పతనానికి ప్రధాన కారణాలు: ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్రెంట్ క్రూడ్ ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందనే భయం మార్కెట్‌ను కలవరపెడుతోంది. ఫలితంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎనర్జీ వంటి కీలక రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తాయి. మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం అంతర్జాతీయ పరిణామాలు కుదుటపడే వరకు దేశీయ సూచీలలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News