Homeబిజినెస్It Emoployees : ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ కంపెనీ

It Emoployees : ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ కంపెనీ

Deloitte : ఐటీ , సర్వీసెస్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని చూస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్త. ప్రపంచ స్థాయి దిగ్గజ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ (Deloitte) భారత్‌లో తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకుంది. మంగళూరులో జరిగిన ‘TiEcon 2026’ సదస్సులో సంస్థ సీఈఓ రోమల్ శెట్టి ప్రకటించిన వివరాలు ఇప్పుడు నిరుద్యోగ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

- Advertisement -

ఏకంగా 50 వేల కొలువులు
ప్రస్తుతం భారత్‌లో డెలాయిట్‌కు 1.40 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. రాబోయే కొద్ది కాలంలోనే మరో 50,000 మంది కొత్త నిపుణులను చేర్చుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది. అంటే త్వరలోనే దేశంలో డెలాయిట్ సైన్యం 1.90 లక్షలకు చేరనుంది. ఒక ఆసక్తికరమైన విషయం.. ప్రపంచవ్యాప్తంగా డెలాయిట్‌లో పనిచేసే ప్రతి నలుగురిలో ఒకరు భారతీయుడే! రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్యను “ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయుడు ఉండేలా పెంచాలన్నది సంస్థ లక్ష్యం.

మీ ఊరికే రానున్న డెలాయిట్
సాధారణంగా ఇలాంటి పెద్ద కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితమవుతాయి. కానీ డెలాయిట్ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చింది. టైర్-2 (ద్వితీయ శ్రేణి) నగరాల్లోని ప్రతిభను అందిపుచ్చుకోవాలని నిర్ణయించుకుంది. మంగళూరు కొత్త టెక్ హబ్‌గా మారబోతోంది. భువనేశ్వర్, కోయంబత్తూర్, లఖ్‌నవూ, ఇండోర్, జైపూర్ వంటి నగరాల్లో కూడా డెలాయిట్ తన కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల స్థానిక యువతకు తమ సొంత ప్రాంతాల్లోనే అంతర్జాతీయ స్థాయి ఉద్యోగం పొందే అవకాశం దక్కుతుంది.

ఏయే విభాగాల్లో ఉద్యోగాలు?
ఈ 50 వేల నియామకాలు ప్రధానంగా భవిష్యత్ టెక్నాలజీలపై ఆధారపడి ఉంటాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI),క్లౌడ్ టెక్నాలజీస్ & సైబర్ సెక్యూరిటీ,డేటా అనలిటిక్స్ ,ఆడిట్ , ట్యాక్స్ వంటి విభాగాల్లో భారీగా ఉద్యోగాలు రానున్నాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని డెలాయిట్ కోరుతోంది. ఒక సెంటర్ ప్రారంభించడానికి పట్టే 6 నెలల సమయాన్ని కేవలం రెండు వారాలకు తగ్గించేలా డిజిటల్ ఎకనామిక్ జోన్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

Imperial Blue : విస్కీ మార్కెట్‌లో ‘ఇంపీరియల్ బ్లూ’ అమ్మకాల సునామీ..!

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం భయాలు ఉన్నప్పటికీ, డెలాయిట్ భారత్‌పై చూపుతున్న ఈ నమ్మకం మన దేశ ఆర్థిక శక్తికి నిదర్శనం. నైపుణ్యం కలిగిన యువతకు ఈ 50 వేల ఉద్యోగాలు ఒక బంగారు అవకాశంగా మారబోతున్నాయి. భారత్ త్వరలోనే ప్రపంచానికి టాలెంట్ క్యాపిటల్‌గా అవతరించడం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News