Saturday, November 15, 2025
HomeTop StoriesDigital Gold: ఫోన్‌పే ద్వారా గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. బంగారం కొనలేనివారికి గోల్డెన్‌ ఛాన్స్‌

Digital Gold: ఫోన్‌పే ద్వారా గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. బంగారం కొనలేనివారికి గోల్డెన్‌ ఛాన్స్‌

Digital Gold Investment In PhonePe: బంగారం ధర రోజురోజుకీ పెరుగుతున్న కొద్దీ గోల్డ్ కొనాలనే ఆలోచనను సామాన్యులు విరమించుకుంటున్నారు. అయితే పసిడి రేట్లతో ఏ మాత్రం సంబంధం లేకుండా మీ దగ్గర ఉన్న నగదుతో బంగారంలో ఇన్వెస్ట్‌ చేయొచ్చని తెలుసా.. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం..

- Advertisement -

బంగారం కొనలేని వాళ్లు ‘డిజిటల్ గోల్డ్’ అనే ఆప్షన్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే డిజిటల్ గోల్డ్ బెస్ట్ ఆప్షన్‌. మార్కెట్‌లో బంగారం రేట్లకు అనుగుణంగా దీని విలువ మారుతుంటుంది. అయితే ఈ డిజిటల్ గోల్డ్‌ను సింపుల్‌గా ఫోన్‌లోనే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందుకు మీకు ఫోన్‌పే అకౌంట్ ఉంటే చాలు. యాప్ ద్వారా మీరు డిజిటల్‌ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడం, అమ్మడం వంటివి చేసి.. మీరు లాభాలను ఆర్జించవచ్చు.  

Also Read: https://teluguprabha.net/sports-news/adar-poonawalla-ceo-of-serum-institute-of-india-hints-at-purchasing-stake-in-ipl-franchise-royal-challengers-bengaluru/

ఫోన్‌పే హోమ్ పేజీలో ‘డిజిటల్ గోల్డ్’ అనే బాక్స్ అనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. డైలీ సేవింగ్స్, బై డిజిటల్ గోల్డ్, గోల్డ్ లోన్, మంత్లీ గోల్డ్ సిప్ అనే నాలుగు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో బై డిజిటల్ గోల్డ్‌పై క్లిక్ చేసి.. మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్‌ను ఎంటర్ చేయాలి. అమౌంట్ ఎంటర్ చేయగానే పక్కన దానికి సమానమైన బంగారం బరువు కనిపిస్తుంది. బంగారం ధరను బట్టి పక్కన వెయిట్‌ కనిపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ నొక్కి పేమెంట్ చేస్తే చాలు.. మీరు ఇక బంగారం సొంతం చేసుకున్నట్టే. 

Also Read: https://teluguprabha.net/cinema-news/rishab-shetty-kantara-chapter-1-movie-history-behind-on-bhoota-kola-and-panjurli-guliga-traditions/

కేవలం 45 సెకన్లలోనే ఫోన్‌పేలో ఈ ఫీచర్‌ని ఉపయోగించి పెట్టుబడి పెట్టొచ్చు. తక్కువ టైంలో, వేగంగా, సౌకర్యవంతంగా బంగారం కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే ఈ డిజిటల్ బంగారాన్ని అమ్మడం కూడా చాలా ఈజీ. మీరు ఆల్రెడీ బంగారాన్ని కొని ఉంటే అక్కడే సెల్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దానపై క్లిక్ చేసి అప్పుడు ఉన్న రేటుకి విక్రయించవచ్చు. ఇక వీటితోపాటు మంత్లీ గోల్డ్ సిప్ ద్వారా ప్రతి నెలా డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మీరు కొన్న గోల్డ్‌పై లోన్ కూడా తీసుకోవచ్చు. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా కొనడం, అమ్మడం లాంటివి చేయాలని గమనించగలరు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad