Saturday, November 15, 2025
Homeబిజినెస్CIBIL Score: క్రెడిట్ కార్డులకు మినిమం డ్యూ కట్టడం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా?

CIBIL Score: క్రెడిట్ కార్డులకు మినిమం డ్యూ కట్టడం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా?

Credit Card: ఈ రోజుల్లో ప్రజలు క్రెడిట్ కార్డుల వినియోగానికి భారీగా అలవాటు పడ్డారు. రోజువారీ అవసరాల నుంచి లగ్జరీ ఖర్చుల వరకు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా క్రెడిట్ కార్డులపై చెల్లించటానికి వినియోగిస్తున్నారు. అయితే వీటిని సక్రమంగా వినియోగించినన్ని రోజులు ఇబ్బంది ఉండదు. కానీ ఓవర్ గా వినియోగించటం తీరా బిల్లు కట్టే సమయానికి చేతులెత్తేస్తున్న వ్యక్తుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే దీని వల్ల వచ్చే సమస్యల గురించి చాలా మందికి తెలియకపోవటం ఒక కారణం కావచ్చు. మరికొందరు మినిమం డ్యూ చెల్లించి చేతులు దులుపుకుంటుంటారు దీనివల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లులో మినిమం బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తే సిబిల్ స్కోర్ మీద ప్రభావం పడుతుందా అనేది అనుమానాలు చాలా మంది కార్డ్ యూజర్లలో ఉన్నాయి. ప్రతినెల బిల్లింగ్ సైకిల్ సమయంలో వచ్చిన మెుత్తం బిల్లు కట్టలేని సమయంలో కేవలం కొంత చిన్న మెుత్తాన్ని చెల్లించటం ద్వారా మిగిన మెుత్తాన్ని తర్వాతి నెలకు క్యారీ చేసే విధానాన్ని మినిమం డ్యూ చెల్లింపు అంటుంటారు. వాస్తవానికి మెుత్తం బిల్లును చెల్లించటం ఉత్తమంగా నిపుణులు సూచిస్తుంటారు. ‘మినిమం అమౌంట్ డ్యూ’ చెల్లిస్తే మీ కార్డు బ్లాక్ అవదు, లేట్ ఫీ వద్దని ఊరట ఉంటుంది అంతే. పైగా చెల్లించకుండా ఉంచిన బిల్లు మెుత్తానికి ఖర్చు చేసిన రోజు నుంచి బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డు అందించిన సంస్థలు వడ్డీని లెక్కిస్తాయి. అది కూడా ముడు రూపాయల నుంచి 5 రూపాయల వరకు ఉంటుంటాయి.

మీరు పదే పదే ఇలా చేస్తుంటే అన్ని పెండింగ్ అమౌంట్లపై వడ్డీ పెరుగుతూ పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే పూర్తిగా బిల్లు చెల్లించకుండా ఎక్కువ సార్లు మినిమం డ్యూ కడుతూ పోతే మీ సిబిల్ స్కోర్ పై అది నెగెటివ్ గా ప్రభావం చూపుతుంది. అంటే మీ క్రెడిట్ స్కోర్ తగ్గి భవిష్యత్తులో మీకు అప్పులు పుట్టడం కష్టతరంగా లేదా ఖరీదైనది అంటే అధిక వడ్డీ రేట్లకు పొందే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సిబిల్ స్కోర్ పాడవడం ఎలా?
మినిమం డ్యూ కడుతూ పోతే బ్యాంకులు, క్రెడిట్ బ్యూరో సంస్థలు మీరు చెల్లింపులను సమర్థవంతంగా చేయలేదని రిపోర్ట్ చేస్తాయి. దీంతో మీ క్రెడిట్ స్కోర్ క్రమంగా తగ్గిపోతుంది.

సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా ఏం చేయాలి..?
క్రెడిట్ కార్డ్ యూజర్లు తమ సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా ఉంచుకోవాలంటే వీలైనంత వరకు ప్రతి నెలా పూర్తి బిల్లు మొత్తాన్ని పూర్తిగా క్లియర్ చేయాలి. చాలామంది మూడు నెలలు, ఆరు నెలలు వరుసగా మినిమం డ్యూ మాత్రమే కడితే స్కోర్ పడిపోవడం ఖాయం. పూర్తిగా కట్టే వాడు, సమయానికి కట్టే వాడుగా బ్యాంక్లు మిమ్మల్ని గుర్తిస్తాయని మర్చిపోవద్దు. కొన్ని నెలల్లో తాత్కాలికంగా మినిమం డ్యూ చెల్లించవచ్చు. కానీ దీన్ని అలవాటుగా మార్చుకోకపోవటం మంచిది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం.. మినిమం డ్యూ కట్టడం వల్ల క్రెడిట్ కార్డు బాలెన్స్ తగ్గదు, కానీ వడ్డీ మాత్రం పెరుగుతుందని గుర్తుంచుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad