CIBIL Score: క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ను ఈఎంఐలుగా మార్చుకోవటం ప్రస్తుతం చాలా పాపులర్ అయిన ఆర్థిక ఎంపికగా మారింది. పెద్ద ఖర్చులను సులభంగా చిన్న చిన్న భాగాలుగా చెల్లించుకోవడం వల్ల, పలు ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఈ అలవాటు మంచిదో లేదో.. సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడం చాలా అవసరం ప్రతి ఒక్కరూ.
EMIలలో చెల్లింపులు చేయడం వల్ల మీ ఖర్చుల బరువును మార్చుకోవచ్చు. కొన్ని క్రెడిట్ కార్డులు వడ్డీ రహిత EMI అవకాశాలను కూడా ఆఫర్ చేస్తున్నాయి. దీంతో అదనపు వడ్డీ ఖర్చు లేకుండా మీ బకాయిలను EMIల ద్వారా చెల్లించే అవకాశం లభిస్తుంది. కానీ ఈఎంఐకి వడ్డీ ఉంటే అదనపు ఖర్చు పెరుగుతుంది. దీనికి తోడు కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులు కూడా వసూలు చేస్తుంటాయని గుర్తుంచుకోండి. EMI పేమెంట్లు సరిగ్గా, సమయానికి చెల్లించకపోతే.. లేటు ఫీజులు, వడ్డీ పెరుగుతాయి. దీని ఫలితంగా సిబిల్ స్కోర్ నెగిటివ్‌గా ప్రభావితమవుతుంది.
సిబిల్ రిపోర్టును బాగా పెంచుకోవటానికి క్రెడిట్ కార్డ్ EMIలు సక్రమంగా, సమయానికి చెల్లించడం ముఖ్యం. అదే సమయంలో మొత్తం క్రెడిట్ యూసేజీ విషయంలో 30 శాతం పరిమితిని దాటకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఎక్కువ క్రెడిట్ యూజ్ చేయడం కూడా స్కోరును తగ్గిస్తుంది.
కాబట్టి ఖర్చులను EMIగా మార్చేముందు మీ ఆదాయ పరిస్థితులు, ఖర్చు సామర్థ్యం బాగా అర్థం చేసుకుని, అవసరమైన సరైన చెల్లింపుల ప్లాన్ ఎంపిక చేసినట్లయితే, ఇది ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డ్ EMIలు ఓ మంచి ఆర్థిక సాధనం అవుతాయా లేదా అన్నది, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ను EMIలలో చేయడం మీ ఆర్థిక పరిస్థితులకు సరిపడితే.. క్రమంగా చెల్లింపులు చేస్తూ ఉంటే, అది సిబిల్ ప్రతికూలంగా ప్రభావం చూపించదు.


