Homeబిజినెస్Stock market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌

Stock market: నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌

Stock market trading: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 406 పాయింట్లకు పైగా క్షీణించగా.. నిఫ్టీ 103 పాయింట్ల మేర నష్టపోయింది. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, ముడిచమురు ధరల పెరుగుదల మరియు భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

- Advertisement -

ప్రభావం చూపిన మోదీ పొదుపు ప్రకటన: శాంతి ఒప్పందానికి ఇరాన్‌ ప్రతిపాదించిన అంశాలను ట్రంప్‌ తిరస్కరించడం, చమురు ధరలు మళ్లీ పెరగడం వంటి కారణాలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. దీనికితోడు ప్రధాని మోదీ ప్రకటించిన కొన్ని పొదుపు చర్యలు సైతం మన మార్కెట్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా పతనం అయ్యింది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి విలువ 95.63 వద్దకు చేరుకుని ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News