Homeబిజినెస్Stock markets: లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock markets: లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

Domestic stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దూసుకుపోతున్నాయి. ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి.

- Advertisement -

భారీ లాభాలు నమోదు: సెన్సెక్స్ 1,300 పాయింట్లు పైగా లాభపడి.. ఉదయం 9:30 గంటల సమయానికి 78,120 స్థాయి వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 390 పాయింట్ల భారీ వృద్ధితో 24,230 మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సైతం పెరిగింది. 12 పైసలు బలపడి రూ. 93.23 వద్ద స్థిరంగా ఉంది.

Also read-Student laptop deal: స్టూడెంట్స్‌కు గెలాక్సీ బుక్ 6 సిరీస్‌పై భారీ తగ్గింపులు.. ఇదే సరైన సమయం

భారీగా పెరిగిన ఇన్వెస్టర్ల సంపద: గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిస్థితులు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. దాదాపు అన్ని రకాల రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తుండటంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ మరియు ఆటోమొబైల్ రంగాలు లభాలతో దూసుకెళ్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News