ED Attach Anil Ambani Assets: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌కి చెందిన 40కిపైగా ఆస్తులను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ ఆస్తుల విలువ సుమారు రూ.3,084 కోట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా పలు కీలక నగరాల్లో నున్న ప్రాపర్టీలను జప్తు చేయడమే కాక.. అనిల్ అంబానీ నివాసం సహా గ్రూప్‌కు చెందిన కంపెనీల ఆఫీసుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో దాదాపు దశాబ్ధకాలం తర్వాత తిరిగి పుంజుకుంటున్న అనిల్ కి ఇది పెద్ద షాకింగ్ ఘటననగా చెప్పుకోవచ్చు.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోంఫైనాన్స్, కమర్షియల్ ఫైనాన్స్ సంస్థలు భారతీయ బ్యాంకుల నుంచి పొందిన వేల కోట్ల రుణాలు చేతులు మారినట్లు, అక్రమంగా ప్రైవేట్ కంపెనీలకి, ఇతర అనుబంధ సంస్థలకి మళ్లించబడినట్లు ఈడీ నివేదికలో ఆరోపించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర పెద్ద బ్యాంకులు ‘ఫ్రాడ్’గా ప్రకటించగానే.. సీబీఐ, ఈడీ కలిసి సోదాలు ప్రారంభించాయి. అనిల్ అంబానీ కారణంగా కేవలం ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ రూ.2,929 కోట్ల మేర నష్టం చవిచూసింది.
2017-19 మధ్య యెస్ బ్యాంక్ RHFL, RCFLకు రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టగా.. ఈ రుణాల మంజూరీకి వెనుక ఉన్న చీకటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి.దేశవ్యాప్తంగా 35కిపైగా అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థలు, వారి కీలక ఉద్యోగుల ప్రాంగణాల్లో ముఖంగా సోదాలు జరిగాయి.అనిల్ అంబానీకి చెందిన ప్రతిష్ఠాత్మక నివాసంతో పాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాదు, పూణే, తిరుపతి, చెన్నై వంటి ప్రాంతాల్లోని విలువైన ప్రాపర్టీలు ప్రస్తుతం ఈడీ ఎటాచ్ చేసిన లిస్టులో ఉన్నాయి. ఇదే క్రమంలో ఈడీ లుక్ అవుట్ నోటీసులను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.
దీనికి తోడు ఇటీవల రిలయన్స్ సంస్థకు చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సహా నలుగురు కీలకమన ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. మెుత్తానికి ఈ కుంభకోణం కేసు సంబంధించి వైఫల్యాలు, బ్యాంక్ మోసాలు, అక్రమ లావాదేవీలు గురించి దేశవ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగుతున్న సమయంలోనే ఈడీ చర్యలు రావటం గమనార్హం.


