Saturday, November 15, 2025
HomeTop StoriesAther Energy : ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో దీనిదే హవా..!

Ather Energy : ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో దీనిదే హవా..!

EV : ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరలు పెరగడం, పర్యావరణ స్పృహ పెరగడంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రంగంలో దేశీయ కంపెనీ అయిన ఏథర్ ఎనర్జీ (Ather Energy) అద్భుతమైన ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది.

- Advertisement -

ఏథర్ సంస్థ తాజాగా తమ హోసూరు ప్లాంట్‌లో తయారుచేసిన 5,00,000వ స్కూటర్‌ను విడుదల చేసి, దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లింది. ఈ రికార్డు మైలురాయికి చేరుకోవడం తమకు చాలా గర్వకారణమని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీఓ స్వప్నిల్ జైన్ అన్నారు. కేవలం వాహనాలను తయారుచేయడమే కాకుండా, పెద్ద స్థాయిలో నమ్మకమైన తయారీ వ్యవస్థను సృష్టించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఫ్యామిలీ స్పెషల్: ఏథర్ రిజ్టా సంచలనం
ఏథర్ తయారుచేసిన ఈ 5 లక్షల స్కూటర్లలో, మూడవ భాగం కేవలం కొత్త మోడల్ అయిన ‘ఏథర్ రిజ్టా’ దే కావడం విశేషం. ఏప్రిల్ 2024లో విడుదలైన ఈ స్కూటర్, ముఖ్యంగా కుటుంబ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడింది.

రిజ్టా ఒక సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ కాదు,ఇది శక్తి, రేంజ్ ,సాంకేతికతకు నిలయం.ఇందులో 4.3 కిలోవాట్ పర్మనెంట్ మాగ్నెటిక్ సింక్రనస్ మోటార్ ఉంది. ఇది 22 న్యూటన్-మీటర్ల టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. కేవలం 4.7 సెకన్లలోనే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.కుటుంబ స్కూటర్ అంటే మైలేజ్ (రేంజ్) మరియు స్టోరేజీ తప్పనిసరి. ఈ రెండు అంశాల్లోనూ రిజ్టా అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది.

ఈ స్కూటర్‌లో రెండు బ్యాటరీ ఆప్షన్లు
2.9 kWh బ్యాటరీ: ఒకే ఛార్జ్‌తో 123 కిలోమీటర్ల వరకు రేంజ్.

3.7 kWh బ్యాటరీ: దీనితో ఏకంగా 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

స్టోరేజీ సొల్యూషన్: నిత్యావసరాలు, సరుకులు తీసుకెళ్లడానికి ఇందులో విశాలమైన స్టోరేజీ ఉంది. సీట్ కింది భాగంలో 34 లీటర్ల స్టోరేజీని అందించారు. దీనికి అదనంగా ముందు భాగంలో 22 లీటర్ల అదనపు ట్రంక్ ఉండటం హెల్మెట్ పెట్టుకోవడానికి, ఇతర వస్తువులకు ఎంతో ఉపయోగపడుతుంది.

టెక్నాలజీ టచ్
ఏథర్ స్కూటర్ అంటే అత్యాధునిక ఫీచర్లు ఉండాల్సిందే. రిజ్టాలో బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, రిమోట్ లాకింగ్ సిస్టమ్, ట్రిప్ మానిటరింగ్, ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే రైడింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది.

ఏథర్ రిజ్టా ధరలు మోడల్‌ను బట్టి రూ. 1,09,999 నుండి రూ. 1,44,000 వరకు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో కేవలం రేసింగ్ స్కూటర్లకే కాకుండా, భారతీయ కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త ఆవిష్కరణలతో ఏథర్ ఎనర్జీ దూసుకుపోతోంది అనడానికి ఈ ‘రిజ్టా’నే నిదర్శనం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad