Elon Musk Tesla $1 Trillion Pay Package: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, టెస్లా (Tesla) సీఈఓ ఎలన్ మస్క్, తన కంపెనీ పెట్టుబడిదారులకు ఊహించని విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత $1 ట్రిలియన్ (సుమారు రూ.87 లక్షల కోట్లు) పే ప్యాకేజీని ఆమోదించాలని కోరారు. చరిత్రలోనే అత్యంత పెద్దదైన ఈ ప్యాకేజీ తన కంపెనీని రక్షించడానికి అవసరమని మస్క్ సమర్థించుకున్నారు.
టెస్లా త్రైమాసిక ఆదాయ నివేదిక నిరాశపరిచిన కొద్ది రోజులకే మస్క్ ఈ ప్రకటన చేశారు. టెలిఫోనిక్ సమావేశంలో, టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యుమనోయిడ్ రోబోట్, సెల్ఫ్-డ్రైవింగ్ కార్యక్రమాలపై దృష్టి సారించినప్పటికీ, మస్క్ ఈ పే ప్యాకేజీపై గట్టిగా మాట్లాడారు.
ALSO READ: iPhone: లవర్స్‌కు గోల్డెన్ ఛాన్స్..రూ.25 వేల భారీ తగ్గింపు
కంపెనీపై నియంత్రణ కోసమే
“నేను ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి కాదు. కంపెనీపై బలమైన ప్రభావాన్ని కొనసాగించడానికి, నాకు తగినంత ఓటింగ్ నియంత్రణ ఉండాలి. అయితే నేను పిచ్చివాడిని అయితే నన్ను తొలగించలేనంత నియంత్రణ ఉండకూడదు” అని మస్క్ స్పష్టం చేశారు. టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజా మాట్లాడుతూ ఉండగా మధ్యలో కలగజేసుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టెస్లా మూడో త్రైమాసికంలో నిర్వహణ ఆదాయంలో 40 శాతం క్షీణతను నమోదు చేసింది. రికార్డు స్థాయిలో వాహనాలు డెలివరీ చేసినప్పటికీ, పెరుగుతున్న ఖర్చులు, యూఎస్ విధానాల మార్పుల కారణంగా లాభాలు అంచనాలను అందుకోలేకపోయాయి.
సలహాదారు సంస్థలపై మండిపాటు
టెస్లా మార్కెట్ విలువ, కార్యాచరణ లక్ష్యాలను చేరుకోవడంపై ఆధారపడి ఉన్న మస్క్ అసాధారణ ప్యాకేజీని తిరస్కరించాలని ప్రముఖ కార్పొరేట్ సలహాదారు సంస్థలు ఐఎస్‌ఎస్ (ISS), గ్లాస్ లూయిస్ పెట్టుబడిదారులకు సిఫార్సు చేశాయి.
ఈ సంస్థల సిఫార్సులపై మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వాటిని “అర్థంలేనివి (asinine)” అని కొట్టిపారేశారు. “వీళ్లు మాకు ఏమాత్రం తెలియదు అన్నట్లుగా సిఫార్సులు చేశారు” అని మండిపడ్డారు.
ఈ పే ప్యాకేజీపై వాటాదారులు నవంబర్ 6న జరిగే EV తయారీదారు వార్షిక సమావేశంలో ఓటు వేయనున్నారు. $455 బిలియన్ల నికర విలువతో మస్క్ బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉన్నారు.
ALSO READ: Apple UK Lawsuit: యాపిల్‌కు భారీ షాక్.. యాప్ స్టోర్ గుత్తాధిపత్యంపై $2 బిలియన్ల దావాలో ఓటమి


