Eox Oko Electric Scooter Offer: ఇంటి అవసరాలు, వ్యాపారానికి ఉపయోగపడేందుకు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే! EOX కంపెనీ OKO ఎలక్ట్రిక్ స్కూటర్ ను తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో అందిస్తోంది. ఇతర ఈవీలతో పోల్చితే దీని ధర తక్కువగానే ఉంది. దీని సులభంగా ఎక్కుపెడితే అక్కడ పార్కింగ్ చేయవచ్చు. దీని బరువు తక్కువ కారణంగా ఈజీగా దూసుకుపోతుంది. ప్రత్యేక విషయం ఏంటంటే?దీని రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. గంటకు 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో వెళ్తుంది. కావున దీన్ని నడిపేవారికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉండదు. తయారీదారు పెద్దవాళ్లు, యువత నడిపేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.
OKO ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు రంగుల్లో లభిస్తుంది. అవి బ్లాక్, గ్రే. బ్యాటరీని ఆదా చేసుకునేలా కంపెనీ ఎకో, స్పోర్ట్స్, హై వంటి మూడు డ్రైవింగ్ మోడ్స్ అందించింది. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే? దీనికి BLDC హెవీ మోటర్ ఇచ్చారు! బ్యాటరీ పరంగా చూస్తే.. కంపెనీ దీనికి 48V లిథియం అయాన్ అందించింది. ఇది రిమూవబుల్ బ్యాటరీ. బ్యాటరీతో పాటు ఛార్జర్ కూడా ఇస్తున్నారు. తద్వారా ఇంట్లో, ఆఫీసులో ఛార్జ్ చేయవచ్చు. బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 50 నుంచి 60కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ ఫుల్లుగా ఛార్జ్ అవ్వడానికి 4 గంటలు పడుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం బ్యాటరీకి IP67 రేటింగ్ ను అందించారు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఇది అందరికి నచ్చుతుంది. కంపెనీ దీని డిజిటల్ డిస్‌ప్లే అందించింది.టైర్ సైజు ముందు, వెనక 10 అంగుళాలు ఉంది. ఇవి ట్యూబ్ లేని టైర్లు. గంటకు 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కారణంగా డ్రమ్ బ్రేకులే పొందుపరిచారు. ఇది ఫైర్ ప్రూఫ్ కోటింగ్ తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ బరువు 60 కేజీలు. ఇది 140 కేజీల బరువు మోస్తుంది. ముందు, వెనక అందించిన సస్పెన్షన్ కారణంగా గతుకుల రోడ్లపై సులభంగా వెళ్తుంది. ఈ స్కూటర్‌కి యాంటీ-థెఫ్ట్ లాక్ సిస్టం ఇచ్చారు. కావున దీని ఎవరు దొంగతనం చేయలేరు. ఈ స్కూటర్‌కి ముందు వైపు DLR ఫ్రంట్ ల్యాంప్ ఇచ్చారు. ఇది చిన్నగా, క్యూట్ లుక్‌తో ఉంది. దీనికి పార్కింగ్ మోడ్ కూడా ఉంది.
ధర గురించి మాట్లాడితే..ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర రూ.59,999. అమెజాన్‌లో 33 శాతం డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఈ స్కూటర్‌ని క్రెడిట్ కార్డుతో రూ.3,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే, అమెజాన్ పే బ్యాలెన్స్ ఆఫర్ ఉపయోగించుకుంటే మరో రూ.1,199 క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఇవన్నీ పోనూ ఈ స్కూటర్ కేవలం రూ.35,800 లభిస్తుంది. చివరగా ఈ స్కూటర్‌పై మొత్తం 40 శాతం డిస్కౌంట్ వచ్చినట్లవుతుంది. దీని EMIలో కొనుగోలు చేయాలంటే రూ.1,939కి పొందవచ్చు.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమెజాన్‌లో 3.8/5 రేటింగ్ ఉంది. ఇప్పటికే దీన్ని 23 మంది కొనుగోలు చేశారు.కొనుగోలుదారులు ఇచ్చిన రివ్యూల ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పెర్ఫార్మెన్స్ బాగుంది. స్మూత్ రోడ్లపై మంచి అనుభూతి అందిస్తోంది. డబ్బుకి తగిన వాల్యూ ఉంది. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై గీతలు పడకుండా ఉంటుందా? అనే విషయంలో మాత్రం మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి.


