Employees’ Provident Fund Organization: ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగంలోని సంస్థలలో ప్రతి నెల జీతం నుంచి ప్రోవిడెంట్ ఫండ్ (పీఎఫ్) కట్ అవుతుంది. UMANG app లేదా EPFO portal ద్వారా మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. అయితే చాలామంది ఉద్యోగులకు ఓ పెద్ద సందేహం – ఈ మొత్తాల్ని ఈపీఎఫ్ఓ ఎక్కడ పెట్టుబడి పెడుతోంది? వాటిపై వడ్డీ ఎలా వస్తోంది?
పీఎఫ్ పథకం కింద ఉద్యోగి, యజమాని ఇద్దరూ ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12 శాతం చొప్పున ప్రతి నెల కంట్రిబ్యూట్ చేస్తారు. ఉద్యోగి నుండి వచ్చిన మొత్తం పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. అలాగే యజమాని నుండి వచ్చిన మొత్తాన్ని EPS(8.33%), EPF(3.67%), EDLI (బీమా పథకం) భాగాలుగా విభజిస్తారు.
Readmore: https://teluguprabha.net/business/bsnl-5-month-validity-prepaid-plan-rupees-997/
ఈపీఎఫ్ఓ మీ డబ్బును నగదు రూపంలో కాకుండా స్థిర ఆదాయ పథకాలలో పెట్టుబడి పెడుతుంది. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 45% నుండి 65% వరకు పెట్టుబడులు గవర్నమెంట్ బాండ్లు & సెక్యూరిటీస్ లలో పెట్టుబడి పెడుతుంది. ఇది అత్యంత భద్రతమైన మార్గం. 20% నుండి 45% వరకు కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెడుతుంది. ఇందులో ప్రభుత్వం కంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. ఈక్విటీ మార్కెట్ లో గరిష్టంగా 15% వరకు పెట్టుబడి పెడుతుంది. ఇందులో అధిక రాబడికి అవకాశం ఉన్న కొంత రిస్క్ కూడా ఉంటుంది.
ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2024–25 సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25%గా ప్రకటించారు. పెట్టుబడుల లాభాలపై వడ్డీ రాబడి ఆధారపడి ఉంటుంది.
Readmore: https://teluguprabha.net/business/mutual-fund-loans-benefits-and-risks/
10 సంవత్సరాల పాటు కంటిన్యూగా కంట్రిబ్యూషన్ చేస్తే, EPS ద్వారా నెలవారీ పెన్షన్ అందుతుంది. 58 ఏళ్ల తర్వాత పెన్షన్‌కు అర్హులు అవుతారు. ఉద్యోగి అకాలమరణం జరిగితే కుటుంబానికి ఆర్థిక భరోసాగా EDLI ద్వారా బీమా ప్రయోజనం పొందవచ్చు. 10 సంవత్సరాల కంటే ముందుగానే ఫారం 10C ద్వారా EPS డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.


