EV Race Heats Up: దేశంలో ఈవీ రేసు జోరందుకుంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికిల్స్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఈవీల విక్రయంలో సంచలనం సృష్టించింది. ఆగస్టు మొదటి 21 రోజుల్లోనే ఏథర్ కంపెనీ 17 శాతం మార్కెట్ షేరుతో రెండో స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి ప్రభుత్వ పోర్టల్ వాహన్ (VAHAN) నివేదిక ఇచ్చింది. 25 శాతం మార్కెట్ షేరుతో ప్రస్తుతం టీవీఎస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 16 శాతం మార్కెట్ షేరుతో ఓలా ఎలక్ట్రిక్ మూడో స్థానంలో నిలిచింది.
Read Also: Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్- పాక్ మధ్య పోరుకు గ్రీన్ సిగ్నల్
మరోవైపు, దక్షిణ భారత్ మార్కెట్‌లో బలమైన పట్టున్న ఏథర్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో కొత్త Rizta మోడల్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి 446 స్టోర్లు ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 700 స్తోర్లు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, హీరో మోటోకార్ప్ మొదటిసారి టాప్-5కి వెళ్లింది. సరికొత్త విడా వీX2 లాంచ్ తర్వాత హీరో మోటోకార్ప్ నేరుగా నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. ఈ మోడల్ ధర సుమారు.82వేలు. అయితే కంపెనీ వినియోగదారుల కోసం ‘బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (BAAS) ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. అంటే వారు బ్యాటరీ ధరను పూర్తిగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వాహన ధర రూ.57 వేలకి తగ్గుతుంది.
Read Also: Online gaming bill: పార్లమెంటులో బిల్లుకి ఆమోదం.. ఇది దేనికి సూచనంటే?
మరోవైపు బజాజ్ ఆటో మార్కెట్ షేరు దారుణంగా పడిపోయింది. ఏకంగా బజాజ్ 12 శాతానికి దిగజారింది. కొన్ని నెలలుగా కంపెనీ 20 శాతం మార్కెట్ షేరుతో ఉంది. అయితే, ఆగస్టు 27న వినాయకచవితి పండుగ సందర్భంగా మహారాష్ట్ర నుంచే బజాజ్ కు కొంత లాభాలు రావచ్చని అంచనా. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు నెలకు సుమారు లక్ష యూనిట్ల వద్ద కొనసాగుతున్నాయి. లక్షలోపు ధర కలిగిన కొత్త మోడళ్ల వల్ల వృద్ధి బలంగా కనిపిస్తోంది. ఇకపై కొత్త ఫీచర్లు, BAAS వంటి స్కీమ్స్‌తో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.


