HIV Cases : ప్రకృతి ఒడిలో సేదతీరాలని కోరుకునే నూతన దంపతులకు, పర్యాటకులకు స్వర్గధామంగా పేరుగాంచిన పసిఫిక్ దీవి ఫిజీ ఇప్పుడు భయం గుప్పిట్లో చిక్కుకుంది. ఒకప్పుడు తన నీలి రంగు సముద్ర తీరాలతో హనీమూన్ జంటలను ఆకర్షించిన ఈ దేశం, ఇప్పుడు హెచ్‌ఐవీ (HIV) వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వణుకు పుట్టిస్తున్న గణాంకాలు
ఫిజీలో హెచ్‌ఐవీ కేసుల పెరుగుదల చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. 2024లో మొత్తం 1,583 కేసులు నమోదు కాగా, 2025 (గతేడాది) కేవలం మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 1,226 కేసులు వెలుగు చూశాయి. అంటే గతంతో పోలిస్తే కేసుల పెరుగుదల శాతం ఊహించని స్థాయిలో ఉంది. పర్యాటక రంగంపై ఆధారపడే ఒక చిన్న దేశానికి ఇది కోలుకోలేని దెబ్బ.
ఏమిటీ ‘బ్లూటూత్’ ట్రెండ్?
ఈ విపరీతమైన వ్యాప్తికి ప్రధాన కారణం అక్కడ ప్రాచుర్యంలోకి వచ్చిన బ్లూటూత్ అనే ప్రమాదకరమైన డ్రగ్ ట్రెండ్ అని నిపుణులు చెబుతున్నారు. ఇది సాంకేతికతకు సంబంధించిన బ్లూటూత్ కాదు, మత్తు పదార్థాలకు సంబంధించిన ఒక వికృత చేష్ట.డ్రగ్స్‌ను ఇంజక్షన్ ద్వారా తీసుకునే వ్యక్తులు, తమ రక్తాన్ని సిరంజిలోకి తీసుకుని, ఆ రక్తాన్ని మరో వ్యక్తికి ఎక్కించడాన్ని అక్కడ ‘బ్లూటూత్’ అని పిలుస్తారు.ఇలా రక్తాన్ని పంచుకోవడం వల్ల వైరస్ ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.దీంతో పాటు అసురక్షిత శృంగారం, మత్తులో తీసుకునే అనాలోచిత నిర్ణయాలు ఫిజీని హెచ్‌ఐవీ ముప్పులోకి నెట్టేస్తున్నాయి.
Apple AI Pin: డిస్ప్లే లేకుండానే ఐఫోన్? అతిపెద్ద మార్పుకు సిద్ధమైన యాపిల్
పర్యాటకులపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ పరిణామాలను గమనిస్తున్నారు. హనీమూన్ డెస్టినేషన్‌గా ఫిజీకున్న బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. డ్రగ్ మాఫియా, విచ్చలవిడి జీవనశైలి కారణంగా ఒక అందమైన దీవి ఇప్పుడు ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయింది. ఫిజీ ప్రభుత్వం ఇప్పటికే అక్కడ ఎమర్జెన్సీ చర్యలు చేపట్టినప్పటికీ, ఈ మహమ్మారిని అరికట్టడం ఒక సవాలుగా మారింది. విదేశీ పర్యటనలకు వెళ్లేవారు, ముఖ్యంగా హనీమూన్ జంటలు ఇలాంటి పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

