Diwali Sale :దసరా ‘బిగ్ బిలియన్ డేస్’ హ్యాంగోవర్ ఇంకా దిగకముందే, ఫ్లిప్‌కార్ట్ పండగ ప్రియులకు మరో మెగా ట్రీట్ అందించింది. దీపావళిని లక్ష్యంగా చేసుకుని “బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025” తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది షాపింగ్ ఉత్సవం అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానుంది.ఫ్లిప్‌కార్ట్ ప్లస్ , బ్లాక్ సభ్యులకు ఒక రోజు ముందే.. అంటే అక్టోబర్ 10 నుంచే భారీ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో అన్ని కేటగిరీలపై భారీ డిస్కౌంట్లు గుప్పించేందుకు సిద్ధమైంది.
టెక్ లవర్స్: Apple, Samsung, OnePlus, Xiaomi వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు స్మార్ట్‌వాచ్‌లపై స్పెషల్ ఆఫర్లు ఉండనున్నాయి.
హోమ్ అప్లయెన్సెస్: కొత్త ఫ్యాషన్ ఉత్పత్తులు మరియు గృహోపకరణాలు (Home Appliances) కూడా అతి తక్కువ ధరలకు లభ్యం కానున్నాయి.
బ్యాంక్ ఆఫర్స్:
కొనుగోలుదారులు మరింత ఆదా చేసుకునేలా ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్లను సిద్ధం చేసింది. SBI క్రెడిట్, డెబిట్ కార్డులు మరియు EMI లావాదేవీలపై 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనపు రివార్డులు మరియు క్యాష్‌బ్యాక్‌లు అందించనుంది.దసరా సేల్‌ను మిస్ అయిన వారు లేదా దీపావళికి కొత్తగా షాపింగ్ చేయాలనుకునేవారికి ఇది పండగ వాతావరణాన్ని మరింత పెంచే బంగారు అవకాశం అనే చెప్పాలి.

