Flipkart Bumper Offers On Geysers on this winter Season: శీతాకాలం వచ్చిందంటే చాలు వణికే చలిలో స్నానం చేయడానికి వెనకడుగు వేస్తుంటారు. అందుకే, చలి నుంచి కాపాడుకునేందుకు వేడి నీటితో స్నానం చేస్తుంటారు. ఇందుకు కొందరు గ్యాస్ స్టవ్ మీద నీరు వేడి చేసుకొని స్నానం చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఇమ్మర్షన్ రాడ్‌తో నీటిని వేడి చేసుకుంటూ స్నానం చేస్తుంటారు. దీనికోసం ఎంతో సమయం వెయిట్ చేస్తుంటారు. అలాంటి వారికి అదిరిపోయే శుభవార్త. మార్కెట్‌లో అతి తక్కువ ధరలోనే గీజర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ సమయాన్ని ఆదా చేయడమే కాదు.. గోరు వెచ్చని నీటిని అందిస్తాయి. అయితే, వీటి ధర ఎక్కువగా ఉంటుందని చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కోసమే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ శీతాకాలం సీజన్‌లో తక్కువ ధరకే లభించే గీజర్ల గురించి తెలుసుకుందాం.
స్టార్‌డమ్ హాట్‌మ్యాట్ సిరీస్ గీజర్ (10L)
ఈ శీతాకాలంలో తక్కువ ధరలోనే బెస్ట్ గీజర్ కోసం చూస్తున్నట్లయితే.. స్టార్‌డమ్ హాట్‌మ్యాట్ సిరీస్ గీజర్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ గీజర్ పది లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. దీని అసలు ధర రూ.6,590 వద్ద ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో భాగంగా దీనిపై ఏకంగా 54 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో, ఇది కేవలం రూ.2,988లకే సొంతం చేసుకోవచ్చు. ఈ గీజర్ 2,000W విద్యుత్ వినియోగంతో వస్తుంది. 1 సంవత్సరం మాన్యుఫాక్చరింగ్ వారంటీని కలిగి ఉంటుంది. అలాగే 5 సంవత్సరాల ఇన్నర్ ట్యాంక్ వారంటీతో వస్తుంది.
లాంగ్‌వే సూపర్బ్ (10L)
ఫ్లిప్‌కార్ట్‌లో లాంగ్‌వే సూపర్బ్ (10L) గీజర్ తక్కువ ధరలోనే లభిస్తుంది. 5 స్టార్ BEE రేటింగ్ గల ఈ గీజర్‌ను కేవలం రూ.3,199 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ గీజర్ SS యాంటీ-రస్ట్ ట్యాంక్-బెటర్ లైఫ్‌ను అందిస్తుంది. ఏడాది పాటు వాల్-టు-వాల్ వారంటీ, 5 సంవత్సరాల ఇన్నర్ ట్యాంక్ వారంటీతో వస్తుంది.
గెస్టర్ స్టార్మ్ ప్లస్ (10L)
ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న మరొక బెస్ట్ వాటర్ హీటర్ గీజర్ గెస్టర్ స్టార్మ్ ప్లస్ (10L). ఇది కూడా పది లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. ఈ గీజర్ ఫ్లిప్‌కార్ట్‌లో 51% తగ్గింపుతో కేవలం రూ.3,072 ధర వద్ద లభిస్తుంది. ఇది కూడా 2,000W పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ఉచిత పైప్ సెట్ అందించారు. 1 సంవత్సరం బ్రాండ్ వారంటీతో పాటు 5 సంవత్సరాల ట్యాంక్ వారంటీ ఉంటుంది.


