Flipkart Diwali Sale 2025: దసరాకు ఆఫర్ల వర్షం కురిపించిన ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. మరోసారి ఆఫర్లు ప్రకటించేందుకు సిద్దమవుతున్నాయి. రానున్న దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సేల్‌ను ప్రకటింటింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ 2025 పేరిట దీన్ని తీసుకురానుంది. ఈ సేల్‌లో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల నుండి గృహోపకరణాల వరకు ప్రతిదానిపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను అందజేస్తుంది. కాగా, ఈ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ అక్టోబర్ 11 నుండి ప్రారంభమవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ సభ్యులకు అక్టోబర్ 10 నుంచే సేల్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌లో బ్యానర్లు, నోటిఫికేషన్‌ల ద్వారా ఈ సేల్‌కు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది.
బిగ్ బ్యాంక్ దివాళీ సేల్ ఆఫర్లు..
బిగ్ బ్యాంక్ దివాళీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్ సహా మరెన్నో అద్భుతమైన ప్రొడెక్టులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించనుంది. మరీ ముఖ్యంగా ఈ సేల్‌లో ఐఫోన్ వంటి ప్రీమియం ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్ 16పై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్‌ను ప్రకటించింది. కొత్త ఫీచర్లు, అదిరిపోయే డిజైన్ కలిగిన ఐఫోన్ 16ను ఈ సేల్‌లో తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే, ఎంత డిస్కౌంట్ ఇస్తుందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు, గూగుల్ పిక్స్ 9 సిరీస్‌పైనా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా, పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతమైన అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఇక, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌పైనా ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీన్ని కూడా తక్కువ ధరకే పొందవచ్చు. ఈ ఫోన్లు మాత్రమే కాకుండా ఆపిల్ మ్యాక్‌బుక్ M2, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, ఇతర బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రీమియం ల్యాప్‌టాప్‌లపై కూడా ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తుంది. అందువల్ల, దసరా సేల్‌లో మిస్ అయిన వారు దివాళీ సేల్‌లో తక్కువ ధరలకు ఇష్టమైన గాడ్జెట్‌లను కొనుక్కోవచ్చు. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్లతో పాటు కార్ట్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డుపై ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్, రివార్డులు లభిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ఇతర బ్యాంక్ కార్డులపై తక్షిణ క్యాష్‌బ్యాక్ సైతం సైతం అందిస్తోంది


