Friday, January 16, 2026
HomeTop StoriesFlipkart: ఫ్లిప్‌కార్ట్‌లో మరో బంపర్‌ సేల్‌.. ‘రిపబ్లిక్‌ డే సేల్‌' పేరుతో దిమ్మదిరిగే ఆఫర్లు

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో మరో బంపర్‌ సేల్‌.. ‘రిపబ్లిక్‌ డే సేల్‌’ పేరుతో దిమ్మదిరిగే ఆఫర్లు

Flipkart Republic Day Sale 2026: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో బిగ్గెస్ట్‌ సేల్‌ నిర్వహణకు సిద్ధమైంది. రాబోయే రిపబ్లిక్‌ డేను దృష్టిలో పెట్టుకొని ‘రిపబ్లిక్‌ డే సేల్‌’ పేరుతో సేల్‌ నిర్వహించనుంది. జనవరి 17 నుంచి ఈ సేల్ ప్రారంభం కానున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. అయితే, సేల్ ఎప్పుడు ముగుస్తుందనే విషయంపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌, బ్లాక్‌ మెంబర్లకు 24 గంటల ముందే రిపబ్లిక్‌ డే సేల్‌ అందుబాటులోకి రానుంది. ప్రతి ఏడాది రిపబ్లిక్‌ డే ముందు ఈ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, 2026 ఏడాదిలో ఇదే మొదటి సేల్‌ కావడం విశేషం. 2026 రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్‌ స్పష్టం చేసింది. అయితే, ఏయే ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉంటాయనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫ్లిప్‌కార్ట్‌ త్వరలోనే తన అఫీషియల్‌ సైట్‌ ద్వారా పంచుకోనుంది. సేల్‌ సమీపిస్తున్న వేళ ఆఫర్ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రిపబ్లిక్‌ డే సేల్‌కు సంబంధించి ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ తన యాప్‌ ద్వారా అనౌన్స్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్ తమ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్లు, హెడ్‌ఫోన్స్‌, బ్లూటూత్స్, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌వాచ్‌లు, వాషింగ్‌మెషీన్లు సహా ఫ్యాషన్, గృహోపకరణాలపై ఆఫర్లు పెడుతున్నట్లు ప్రకటించింది. ఈసారి కూడా వీటిపైనే ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉండనున్నట్లు తెలిపింది. బిగ్ బిలియన్ డేస్ సేల్, బిగ్ సేవింగ్ డేస్ సేల్, బిగ్ దీపావళి సేల్, ఎండ్-ఆఫ్-సీజన్ సేల్, షాపింగ్ ఉత్సవ్ సేల్ వంటి ఎన్నో రకాల సేల్స్‌ నిర్వహిస్తూ ఫ్లిప్‌కార్ట్‌ తన కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News