Gold Rate Today: యూస్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల వడ్డీ రేట్ల తగ్గింపు తర్వాతి నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు భారీగా పెరగటం తిరిగి స్టార్ట్ చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు బాండ్ ఈల్డ్స్ తగ్గిపోవటంతో.. తమ సంపద విలువ కరిగిపోకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా విలువైన లోహాలను ఎంచుకుంటున్నారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలకు రిటైల్ మార్కెట్లలో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పెరగటం తెలుగు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
శనివారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.82 తగ్గింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.11, 215 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.10,280 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.లక్ష 45వేల వద్ద కొనసాగుతోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్లి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.11,226, ముంబైలో రూ.11,215, దిల్లీలో రూ.11,230, కలకత్తాలో రూ.11,215, బెంగళూరులో రూ.11,215, కేరళలో రూ.11,215 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,290, ముంబైలో రూ.10,280, దిల్లీలో రూ.10,295, కలకత్తాలో రూ.10,215, బెంగళూరులో రూ.10,215, కేరళలో రూ.10,215గా ఉన్నాయి.


