Saturday, November 15, 2025
HomeTop StoriesGold: రూ. 50,000 కోట్ల బంగారు అమ్మకాలు, వెండికి 40% పెరిగిన డిమాండ్

Gold: రూ. 50,000 కోట్ల బంగారు అమ్మకాలు, వెండికి 40% పెరిగిన డిమాండ్

Gold price : పర్వదినం వేళ బంగారం, వెండి ధరలు కాస్త దిగిరావడంతో దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు పండగ చేసుకుంటున్నారు. శనివారం ఉదయం నుంచే జ్యువెలరీ దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ధరలు తగ్గడంతో ఇదే మంచి అవకాశంగా భావించి చాలామంది కొనుగోళ్లను వ్యూహాత్మకంగా జరుపుతున్నారు.

- Advertisement -

భారీ అంచనాలు: రూ. 50,000 కోట్ల టర్నోవర్
ఈ పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా రూ. 50,000 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాల అమ్మకాలు జరుగుతాయని అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) అంచనా వేస్తోంది. గతేడాదితో పోలిస్తే కొనుగోళ్ల పరిమాణం (వాల్యూమ్) 10 నుంచి 15 శాతం తగ్గినా, విలువ పరంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయని జీజేసీ ఛైర్మన్ రాజేశ్ రోక్డే తెలిపారు. బంగారం, వెండి ధరలు అధికంగా ఉన్నప్పటికీ, వినియోగదారుల్లో ఉత్సాహం తగ్గలేదు. చాలామంది పెళ్లిళ్ల కోసం ముందుగానే కొనుగోళ్లు చేస్తున్నారు” అని ఆయన వివరించారు.

కొనుగోలు తీరులో మార్పులు: హాల్‌మార్క్‌కే తొలి ప్రాధాన్యం
ఈసారి కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఉన్న బంగారు నాణేలు, తేలికపాటి ఆభరణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని రాజేశ్ రోక్డే పేర్కొన్నారు.ముఖ్యంగా, వెండి వస్తువుల అమ్మకాలు గతేడాది కన్నా ఏకంగా 40 శాతం పెరగడం ఈ పండగ సీజన్‌లోని హైలైట్! వెండి నాణేలు, పూజా సామాగ్రిని ఎక్కువగా కొంటున్నారని ఆయన అన్నారు.

టైర్ 2, టైర్ 3 నగరాల్లో వెండి జోష్
వినియోగదారుల కొనుగోలు తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని జీజేసీ వైస్ ఛైర్మన్ అవినాశ్ గుప్తా తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఒక్కో లావాదేవీ సగటు విలువ 20-25 శాతం పెరిగింది. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ పెట్టుబడిగా, బహుమతులుగా ఇచ్చేందుకు వెండి నాణేల కొనుగోళ్లు 35-40 శాతం పెరిగాయి.యువత తమ వ్యక్తిగత విజయాలకు గుర్తుగా తేలికపాటి ఆభరణాలు కొనుక్కోవడం కూడా 15 శాతం పెరిగిందని ఆయన చెప్పారు.

పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని చాలా దుకాణాలు ఉదయాన్నే తెరుచుకున్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు, అలాగే ఆదివారం మధ్యాహ్నం వరకు ధంతేరాస్ ముహూర్తం ఉండటంతో, రాబోయే గంటల్లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad