Gold Price Today: ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం రేటు దాదాపు 4వేల డాలర్ల మార్కును చేరుకుంది. దీనికి అనుగుణంగానే రిటైల్ మార్కెట్లలో బంగారం రేటు విపరీతంగా పెరుగుతోంది. కేవలం ఈ వారం మెుదటి మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు రూ.3వేల 770 పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇలా అయితే బంగారం భవిష్యత్తులో కొనటం కష్టమేననే ఆందోళనలు వారి నుంచి వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు దిగజారటంతో రేట్లు ఇంకా పెరగొచ్చనే భయాలు కొనసాగుతున్నాయి.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
మంగళవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.115 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12, 317 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,290 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.లక్షా 67వేల వద్ద చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,328, ముంబైలో రూ.12,317, దిల్లీలో రూ.12,332, కలకత్తాలో రూ.12,317, బెంగళూరులో రూ.12,317, కేరళలో రూ.12,317 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,300, ముంబైలో రూ.11,290, దిల్లీలో రూ.11,305, కలకత్తాలో రూ.11,290, బెంగళూరులో రూ.11,290, కేరళలో రూ.11,290గా ఉన్నాయి.


