Gold Rate Today: ప్రపంచ వ్యాప్తంగా బంగారం రేట్లు ఒక్కసారిగా ర్యాలీని చూస్తున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 3500 డాలర్ల మార్కును చేరుకుంది. ఈ క్రమంలో భారతదేశంలో రిటైల్ మార్కెట్లలో 10 గ్రాముల స్వచ్చమైన గోల్డ్ రేట్లు నిరంతరం పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు వార్తలతో పాటు సెంట్రల్ బ్యాంకుల షాపింగ్, ఇన్వెస్టర్ల స్టాకింగ్, గ్లోబల్ జియో పొలిటికల్ ఆందోళనలు ర్యాలీకి కీలక కారణాలుగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం గోల్డ్ తన అత్యధిక రేట్ల వద్ద ఉండటంతో ఇన్వెస్ట్మెంట్ కోసం కొనటానికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి బదులు గోల్డ్ ఈటీఎఫ్స్, ఎస్ఐపీ పెట్టుబడులు బెటర్ అని వారు అంటున్నారు.
24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.21 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, వైజాక్ నగరాల్లో గ్రాము రేటు రూ.10, 609 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.9,725 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి రూ.లక్ష 36వేల 100 వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము రూ.136.10 అన్నమాట.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్లి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.10,609, ముంబైలో రూ.10,609, దిల్లీలో రూ.10,624, కలకత్తాలో రూ.10,609, బెంగళూరులో రూ.10,609, కేరళలో రూ.10,609 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9,725, ముంబైలో రూ.9,725, దిల్లీలో రూ.9,740, కలకత్తాలో రూ.9,725, బెంగళూరులో రూ.9,725, కేరళలో రూ.9,725గా ఉన్నాయి.


