Gold Price Today: దీపావళి తర్వాతి నుంచి భారతదేశంలో బంగారం రేట్లు భారీగానే పతనాన్ని చూస్తున్నాయి. దీనికి అనేక అంతర్జాతీయ సానుకూలతలు కూడా కారణంగా ఉన్నాయి. భారతదేశంలో ప్రజలు ఎక్కువగా ధనత్రయోదశి, దీపావళి వంటి పర్వదినాలకు షాపింగ్ చేస్తుండగా.. ప్రస్తుతం రేట్ల పతనంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తమ అవసరాల కోసం ఆభరణాల కొనుగులుకు ముందుగా తగ్గిన రేట్లను పరిశీలించటం ముఖ్యం..
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలను కొద్ది రోజుల కిందటి నుంచి పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. కానీ నెమ్మదిగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.
బుధవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12, 720 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,660 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.2వేలు తగ్గి రూ.లక్ష 80 వేల వద్ద చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,764, ముంబైలో రూ.12,720, దిల్లీలో రూ.12,735, కలకత్తాలో రూ.12,720, బెంగళూరులో రూ.12,720, కేరళలో రూ.12,720 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,670, ముంబైలో రూ.11,660, దిల్లీలో రూ.11,675, కలకత్తాలో రూ.11,660, బెంగళూరులో రూ.11,660, కేరళలో రూ.11,660గా ఉన్నాయి.


