Gold Rate Today: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. దీనికి తోడు ఈ ఏడాది మెుత్తంగా మరో రెండుసార్లు రేట్ల తగ్గింపు ఉండొచ్చని హింట్ ఇచ్చింది. పావెల్ చేసిన ప్రకటనతో బులియన్ మార్కెట్లు కూడా వాటిని డైజెస్ట్ చేసుకుంటూ రికార్డ్ గరిష్ఠాల నుంచి తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు స్పాట్ మార్కెట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ, పండక్కి ముందు మెరుగుపడుతున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులతో బంగారం, వెండి రేట్లు తగ్గటం ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణలో ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయో షాపింగ్ ముందు తప్పక తెలుసుకోవాల్సిందే..
గురువారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.54 తగ్గింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.11, 117 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర తగ్గిన తర్వాత రూ.10,190 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ వెయ్యి రూపాయలు తగ్గుముఖం పట్టి రూ.లక్ష 41వేల వద్ద కొనసాగుతోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్లి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.11,149, ముంబైలో రూ.11,117, దిల్లీలో రూ.11,132, కలకత్తాలో రూ.11,117, బెంగళూరులో రూ.11,117, కేరళలో రూ.11,117 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,220, ముంబైలో రూ.10,190, దిల్లీలో రూ.10,205, కలకత్తాలో రూ.10,190, బెంగళూరులో రూ.10,190, కేరళలో రూ.10,190గా ఉన్నాయి.


