Gold Rate Today: స్పాట్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నిపుణులు ఊహించినట్లుగా వెండి ఔన్సు రేటు 40 డాలర్లను కూడా చేరుకుంది. దీంతో బంగారం ధరలు ఎప్పుడూ చూడని సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంటూ సామాన్య మధ్యతరగతి భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. కనీసం కాసు బంగారం కొందాం అనుకునేవారు తమ స్థోమతకు మించి రేట్లు ఉండటంతో వెండి వైపు చూస్తున్నారు. కానీ అక్కడ కూడా అధిక ధరలు వారికి నిరాశ కలిగిస్తూనే ఉన్నాయి.
24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.88 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.10, 697 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.9,805 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి రూ.లక్ష 37వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము రూ.137 అన్నమాట. ఈ రోజు వెండి కేజీకి దాదాపు రూ.900 పెరుగుదలను చూసింది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్లి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.10,697, ముంబైలో రూ.10,697, దిల్లీలో రూ.10,712, కలకత్తాలో రూ.10,697, బెంగళూరులో రూ.10,697, కేరళలో రూ.10,697 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9,805, ముంబైలో రూ.9,805, దిల్లీలో రూ.9,820, కలకత్తాలో రూ.9,805, బెంగళూరులో రూ.9,805, కేరళలో రూ.9,805గా ఉన్నాయి.
బంగారం వెండి రేట్ల పెరుగుదలను ప్రేరేపిస్తున్న కారణాలు..
అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు వార్తలతో పాటు సెంట్రల్ బ్యాంకుల షాపింగ్, ఇన్వెస్టర్ల స్టాకింగ్, గ్లోబల్ జియో పొలిటికల్ ఆందోళనలు ర్యాలీకి కీలకగా మారాయి. ఈ క్రమంలో చాలా మంది రిటైలర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బెట్టింగ్ వేస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం కొంత అప్రమత్తత అవసరం అని అంటున్నారు.


