Gold Rate Today: నవరాత్రులు నామాన్యుల బంగారంగా చెప్పుకునే వెండి విపరీతమైన ర్యాలీని కొనసాగిస్తోంది. ఏడాది కిందటి కంటే దాదాపు రెండింతలకు రేట్లు చేరటం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరో పక్క ట్రంప్ ఆటో, ఫార్మా రంగాలపై కూడా టారిఫ్స్ ప్రకటించటంతో బంగారం రేట్లు కూడా శనివారం మళ్లీ పెరుగుదలను చూశాయి. ఈ క్రమంలో కొనటానికి ముందు రేట్లను తప్పకుండా పరిశీలించటం ముఖ్యం..
శనివారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.60 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.11, 548 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.10,585 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.6000 పెరగటంతో రూ.లక్షా 59వేల వద్దకు చేరుకుని చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.11,608, ముంబైలో రూ.11,548, దిల్లీలో రూ.11,563, కలకత్తాలో రూ.11,548, బెంగళూరులో రూ.11,548, కేరళలో రూ.11,548 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,640, ముంబైలో రూ.10,585, దిల్లీలో రూ.10,600, కలకత్తాలో రూ.10,585, బెంగళూరులో రూ.10,585, కేరళలో రూ.10,585గా ఉన్నాయి


