Saturday, November 15, 2025
Homeబిజినెస్Gold Rate: సోమవారం భారీగా పెరిగిన బంగారం, అదే దారిలో వెండి.. తాజా రేట్లివే

Gold Rate: సోమవారం భారీగా పెరిగిన బంగారం, అదే దారిలో వెండి.. తాజా రేట్లివే

Gold Price Today: సోమవారం అనూహ్యంగా బంగారం, వెండి రేట్లు మళ్లీ పుంజుకున్నాయి. పెళ్లిళ్ల కోసం షాపింగ్ చేస్తున్న ప్రజలకు పెరిగిన రేట్లు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం రేట్లు పెరిగిన నేపథ్యంలో ప్రజలు ముందుగా రేట్లను తనిఖీ చేయటం ముఖ్యం.

- Advertisement -

గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. కానీ నెమ్మదిగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.

శుక్రవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12,322 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,295 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.లక్ష 67 వేల వద్ద ఉంది.

ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,448, ముంబైలో రూ.12,322, దిల్లీలో రూ.12,337, కలకత్తాలో రూ.12,322, బెంగళూరులో రూ.12,322, కేరళలో రూ.12,322 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,410, ముంబైలో రూ.11,295, దిల్లీలో రూ.11,310, కలకత్తాలో రూ.11,295, బెంగళూరులో రూ.11,295, కేరళలో రూ.11,295గా ఉన్నాయి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad