Gold rate today in hyderabad : పసిడి ప్రియులకు ఊరటనిచ్చే తీపి కబురు! నిన్నమొన్నటిదాకా ఆకాశమే హద్దుగా పరుగులు తీసిన బంగారం, వెండి రేట్లు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ బులియన్ మార్కెట్లలో ధరలు కుప్పకూలాయి.
భారీగా తగ్గిన ధరలు: క్యాప్స్ గోల్డ్ సమాచారం ప్రకారం, హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,480 తగ్గి రూ.1,51,720 వద్ద స్థిరపడింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1,36,650 పలుకుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ 4,137 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వెండి సైతం గణనీయంగా క్షీణించింది. కిలో వెండి ఏకంగా రూ.3,896 తగ్గి రూ.2,27,802కు చేరింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ సిల్వర్ ధర 60.69 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ధరల పతనానికి కారణాలివే: భారత్ తన బంగారం అవసరాలకు అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, బలపడుతున్న అమెరికన్ డాలర్, ముడిచమురు ఒడిదుడుకులు దేశీయ బులియన్‌పై తీవ్ర ప్రభావం చూపాయి.
కొనుగోలుదారులకు సూచన: ఆభరణాల కొనుగోలు వేళ కేవలం గ్రాము రేటునే కాకుండా, తరుగు (మేకింగ్ ఛార్జీలు), జీఎస్టీ, హాల్‌మార్కింగ్ రుసుములు వంటివి కలుపుకుని తుది బిల్లు ఎంతవుతుందో సరిచూసుకోవడం కొనుగోలుదారులకు శ్రేయస్కరం.

