Gold Rate Today: ఈసారి దసరా నవరాత్రుల సమయంలో కొద్దిగా రేట్లు తగ్గితే కొనుక్కుందాం అని చాలా కాలంగా వేచి చూస్తున్న ప్రజలకు గోల్డ్, సిల్వర్ షాక్ ఇస్తున్నాయి. బంగారం వెండి రేట్లు ఆల్ టైమ్ గరిష్ఠాలకు చేరుకుని సామాన్య మధ్యతరగతికి పూర్తిగా దూరం అవుతున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక రాజకీయ పరిస్థితులే రేట్ల ర్యాలీని ప్రేరేపిస్తున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో సెంట్రల్ బ్యాంక్స్ పరోక్షంగా షాపింగ్ తో రేట్లకు ఆజ్యం పోస్తున్నాయి.
సోమవారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.126 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.11, 433 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.10,480 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.వెయ్యి పెరిగి రూ.లక్ష 49వేల వద్ద కొనసాగుతోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్లి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.11,455, ముంబైలో రూ.11,433, దిల్లీలో రూ.11,448, కలకత్తాలో రూ.11,433, బెంగళూరులో రూ.11,433, కేరళలో రూ.11,433 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,500, ముంబైలో రూ.10,480, దిల్లీలో రూ.10,495, కలకత్తాలో రూ.10,480, బెంగళూరులో రూ.10,480, కేరళలో రూ.10,480గా ఉన్నాయి.


