Gold Rate Today: అమెరికా అధ్యక్షుడు చేస్తున్న పనులు ప్రపంచం మెుత్తాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రానున్న కాలంలో ఆయన ప్రవర్థన ప్రపంచ దేశాలను ఇంకెలా దెబ్బతీస్తుందనే ఆందోళనల మధ్య సెంట్రల్ బ్యాంకుల నుంచి సామాన్య పెట్టుబడిదారుల వరకు అందరు బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
సోమవారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.43 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.11, 258 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.10,320 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.3వేలు పెరిగి రూ.లక్ష 48వేల వద్ద కొనసాగుతోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్లి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.11,302, ముంబైలో రూ.11,258, దిల్లీలో రూ.11,273, కలకత్తాలో రూ.11,258, బెంగళూరులో రూ.11,258, కేరళలో రూ.11,258 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,360, ముంబైలో రూ.10,320, దిల్లీలో రూ.10,335, కలకత్తాలో రూ.10,320, బెంగళూరులో రూ.10,320, కేరళలో రూ.10,320గా ఉన్నాయి.


