Thursday, March 12, 2026
Homeబిజినెస్Gold Rate: భారీగా తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఊరట.. తాజా...

Gold Rate: భారీగా తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఊరట.. తాజా రేట్లివే

Gold Price Today: రోజురోజుకూ పెరుగుతూ నిద్రలేకుండా చేసిన బంగారం, వెండి ధరలు శుక్రవారం స్వల్ప తగ్గింపుతో చిన్న బ్రేక్ తీసుకున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ముదురుతున్న వేళ ఇన్వెస్టర్లు, ప్రజలు బంగారం, వెండికి డబ్బును షిఫ్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా తమ ప్రాంతంలో రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం.

- Advertisement -

గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త ఏడాదిలో అంతర్జాతీయ పరిణామాలు మెల్లగా కొలిక్కి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగితే ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

also read Democracy : ప్రశ్నిస్తే సంకెళ్లు.. ప్రశ్నించకుంటే సన్మానాలు! మోదీ పాలనపై డా. రేఖ బోయలపల్లి నిప్పులు

శుక్రవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.17,062 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.15,640 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.4 లక్షల 15వేల వద్ద ఉంది.

ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.17,673, ముంబైలో రూ.17,062, దిల్లీలో రూ.17,077, కలకత్తాలో రూ.17,062, బెంగళూరులో రూ.17,062, కేరళలో రూ.17,062 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.16,200, ముంబైలో రూ.15,640, దిల్లీలో రూ.15,655, కలకత్తాలో రూ.15,640, బెంగళూరులో రూ.15,640, కేరళలో రూ.15,640గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News