Saturday, November 15, 2025
Homeబిజినెస్GST reforms in 2025 : ఇల్లు కట్టడం, కొనడం ఇకపై ఎంతో చౌక!

GST reforms in 2025 : ఇల్లు కట్టడం, కొనడం ఇకపై ఎంతో చౌక!

GST reforms in 2025 : సొంత ఇల్లు కట్టుకోవాలనే కల సామాన్యుడి జీవితంలో అతిపెద్ద ఆకాంక్ష. ఈ కలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2025లో జీఎస్టీ సంస్కరణలతో శుభవార్త అందించనుంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్, టైల్స్, పెయింట్స్ వంటి సామగ్రిపై ప్రస్తుతం 5% నుంచి 28% వరకు జీఎస్టీ విధిస్తున్నారు. సిమెంట్, పెయింట్స్‌పై 28%, స్టీల్, టైల్స్‌పై 18%, ఇసుకపై 5% పన్ను ఉంది. ఈ వేర్వేరు పన్ను రేట్ల వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది, ఇది కొనుగోలుదారులపై భారంగా మారుతోంది.

- Advertisement -

ALSO READ: Hyderabad: చంపేసి..గేటు వెనుక నక్కి..షాక్‌ ఇస్తున్న సీసీ టీవీ రికార్డు!

ప్రభుత్వం 2025 దీపావళి నాటికి జీఎస్టీ స్లాబ్‌లను సరళీకరించి, నిర్మాణ సామగ్రిపై పన్నులను 18% లేదా అంతకంటే తక్కువ స్థాయికి తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల బిల్డర్ల నిర్మాణ వ్యయం 10-20% తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పొదుపు కొనుగోలుదారులకు ఇంటి ధరల తగ్గింపు, తక్కువ ఈఎంఐ రూపంలో ప్రయోజనం చేకూరుస్తుంది. మధ్యతరగతి, అఫర్డబుల్ హౌసింగ్ కొనుగోలుదారులకు ఇది పెద్ద ఊరట. అయితే, లగ్జరీ ఇళ్లలో దిగుమతి ఫిట్టింగ్‌లపై 40% పన్ను విధిస్తే ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది.

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) విధానం మెరుగుపడితే, బిల్డర్లు తమ ఖర్చులను మరింత తగ్గించుకోవచ్చు. గత ఐదేళ్లలో నిర్మాణ వ్యయం 40% పెరిగిన నేపథ్యంలో, ఈ సంస్కరణలు డెవలపర్లు, కొనుగోలుదారులకు ఉపశమనం కలిగిస్తాయి. అఫర్డబుల్ హౌసింగ్‌పై 1% జీఎస్టీ కొనసాగనుంది, కానీ సాధారణ గృహాలపై 5% నుంచి 3%కి తగ్గితే మరింత లాభం ఉంటుంది. ఈ మార్పులు గృహ నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోస్తాయని, సామాన్యుడి సొంతింటి కలను సులభతరం చేస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad