Saturday, November 15, 2025
Homeబిజినెస్IT Stocks Crash: సోమవారం కుప్పకూలనున్న భారత ఐటీ స్టాక్.. మెుత్తం కంపు కంపు చేస్తున్న...

IT Stocks Crash: సోమవారం కుప్పకూలనున్న భారత ఐటీ స్టాక్.. మెుత్తం కంపు కంపు చేస్తున్న ట్రంప్..

Monday Markets: హెచ్1బి వీసా పాలసీలో సంచలనాత్మక మార్పులతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్రంగా ప్రభావితం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ ఐటీ రంగానికి చెందిన లిస్టెడ్ కంపెనీలు ప్రధానంగా నష్టాపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ప్రభుత్వం హెచ్1బి వీసా ఫీజు కొత్త అప్లికెంట్లకు లక్ష డాలర్లకు పెంచినట్లు ప్రకటించింది. దీంతో భారత్‌తో పాటు అమెరికా ఐటీ కంపెనీలకు కూడా భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

భారతదేశానికి చెందిన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు అంతర్జాతీయంగా వేలాది మంది భారతీయులకు హెచ్1బి వీసాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజా నిర్ణయం వల్ల వీటి లాభాల్లో కనీసం 8 నుండి 10 శాతం వరకు తగ్గుదల వచ్చేందుకు అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వారానికి ముందు ట్రేడింగ్‌లోనూ ఇన్ఫోసిస్ షేరు 3.4%, కాగ్నిజెంట్ 4.75% పడిపోయాయి. సోమవారం (22 సెప్టెంబర్) స్టాక్ మార్కెట్లు ప్రారంభం నుంచే ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని చూస్తాయని ఊహించవచ్చు.

ఈ వీసా విధానంపై అమెరికా కంపెనీల్లోనూ అనిశ్చితి నెలకొని ఉంది. అమెరికాకు డెలివరీ సెంటర్లపై ఆధారపడే భారత కంపెనీలు ఖర్చు పెరగడంతో బిజినెస్ ప్రాజెక్టులు తగ్గిపోతూ ఇతర దేశాల వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఉద్యోగ నియామకాల్లో తగ్గుదల, మధ్య స్థాయి విభాగాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం నిపుణులది.

అంతర్జాతీయంగా అమెరికా టెక్ కంపెనీలైన టెస్లా, అమెజాన్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి సంస్థలు కూడ ఇలాంటి ఖర్చుల వల్ల పనిచేసే భారతీయులు సంఖ్యను తగ్గించాల్సి రావచ్చు. కొత్త ఔట్‌సోర్సింగ్ వ్యాపారంపై ప్రభావం తెలంగాణ, కర్నాటకలోని ఐటీ హబ్‌లపై ఉండొచ్చని టెక్ వర్గాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లలో భారీ ఒత్తిడి ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. పెట్టుబడి చేసేవారు, ఉద్యోగ ప్రాధాన్యత కలిగిన ఐటీ రంగ సంస్థలు ఇదే సమయంలో తమ వ్యూహాల మార్పుని పునఃసమీక్షించాల్సిన అవసరముందని గ్రహించి ముందుకు సాగాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad