Sunday, February 8, 2026
Homeబిజినెస్HDFC : లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ

HDFC : లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ

Personal Loan : మీరు పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) తగ్గించింది. ఈ కొత్త రేట్లు జనవరి 7, 2026 నుంచే అమల్లోకి వచ్చాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను తగ్గించడంతో, ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసే క్రమంలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ తీసుకునే వారికి ఊరటనిస్తూ వడ్డీ రేట్లలో కోత విధించింది.

- Advertisement -

 

One Point One Solutions : ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న చిన్న కంపెనీ

 

ఎంసీఎల్ఆర్ రేట్ల తగ్గింపు
ఇటీవల ఆర్బీఐ రెపో రేటును ఏకంగా 1.25 శాతం తగ్గించడంతో, ఇప్పుడు ఆ ప్రయోజనం నేరుగా కస్టమర్లకు అందుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ రేట్లను తగ్గించడంతో, ఈ రేటుకు అనుసంధానమై ఉన్న అన్ని లోన్ల వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయి. కొత్త రేట్లు 2026, జనవరి 7వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ రేట్లు 8.25 శాతం నుంచి 8.55 శాతంగా ఉన్నాయి.

తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్స్
బ్యాంక్ అందిస్తున్న ‘ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్’ ద్వారా రూ. 50 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. కేవలం 9.99 శాతం ప్రారంభ వడ్డీ రేటుతోనే రుణాలు లభిస్తున్నాయి. ఒకవేళ మీరు ముందే గుర్తింపు పొందిన ప్రీ-అప్రూవ్డ్ కస్టమర్ అయితే, కేవలం 10 సెకన్లలోనే మీ ఖాతాలోకి నగదు జమ కావడం విశేషం.

అర్హతలు & నిబంధనలు
ఈ రుణాలను పొందడానికి అభ్యర్థి వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం రెండేళ్ల ఉద్యోగ అనుభవంతో పాటు, నెలకు రూ. 25 వేల కనీస జీతం ఉండాలి. మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారికి అతి తక్కువ వడ్డీకే రుణం లభించే అవకాశం ఉంటుంది.

ఈఎంఐ లెక్కలు ఇలా..
మీరు రూ. 10 లక్షల రుణాన్ని 10 శాతం వడ్డీతో 5 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంటే, నెలకు రూ. 21,247 ఈఎంఐ పడుతుంది. వడ్డీ రేటు 11 శాతానికి పెరిగితే ఈఎంఐ రూ. 21,742గా, అదే 12 శాతమైతే రూ. 22,244గా మారుతుంది. లోన్ తీసుకునే వారు తమ టెన్యూర్ తగ్గించుకోవడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News