HDFC Loan Rates Cut: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు కూడా ప్రస్తుతం తమ వడ్డీ రేట్లను క్రమంగా తగ్గిస్తున్నాయి. గతంలో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ కొన్ని బ్యాంకులు ఆ ప్రయోజనాలకు మించి ప్రస్తుతం వడ్డీ తగ్గింపులను ప్రకటిస్తూ వ్యాపారాన్ని స్పీడప్ చేసే పనిలో ఉన్నాయి.
తాజాగా HDFC బ్యాంక్ తన MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెడ్డింగ్ ఫండ్స్ రేటు)ను ఎంపిక చేసిన లోన్ కాలవ్యవధిపై 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఇది 2025 ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ తగ్గింపు MCLR- లింక్డ్ లోన్‌లు తీసుకున్న రుణగ్రహీతలకు వడ్డీ భారాన్ని కొంచెం తగ్గడంతో ప్రయోజనం చేకూరుతుంది.
HDFC బ్యాంక్ కొత్త రేట్లు వివరాలు..
* ఒవర్నైట్ MCLR: 8.55%
* 1 నెల MCLR: 8.55%
* 3 నెలలు MCLR: 8.60%
* 6 నెలలు MCLR: 8.65%
* 1 సంవత్సరం MCLR: 8.70%
* 2 సంవత్సరాల MCLR: 8.70%
* 3 సంవత్సరాల MCLR: 8.75%
MCLR 5 బేసిస్ పాయింట్లు తగ్గించడం అంటే.. ప్రతీ రూ.1 లక్ష రుణంపై.. వడ్డీ రేటు 0.05% వరకు తగ్గుతుందనమాట. ఉదాహరణకు.. ఒకరు రూ.20 లక్షలు హోం లోన్ తీసుకుంటే (పది సంవత్సరాల కాలం, 8.70% రేటుతో), 5 బేసిస్ పాయింట్లు తగ్గితే వారి EMI స్వల్ప తగ్గింపును చూస్తుంది. వ్యక్తి రూ.20 లక్షల లోన్ 20 ఏళ్ల కాలానికి తీసుకున్నప్పుడు వచ్చే మార్పు కొత్త రేటు కింద పరిశీలిస్తే.. బ్యాంక్ ప్రకటించిన ప్రస్తుత వడ్డీ తగ్గింపుతో ప్రతి నెల సుమారు రూ.60 నుంచి రూ.70 వరకు EMI తగ్గుతుంది. మొత్తం కాలంలో ఈ తగ్గింపు దాదాపు రూ.4,000 వరకు ఉంటుంది. EMI తగ్గింపు చిన్నదే అయినా.. దీర్ఘకాలంలో ఇది పెద్ద మొత్తంగా మారనుంది.
ఎవరి ప్రయోజనం అందుతుంది..?
1. MCLR -లింక్డ్ లోన్‌దారులకు మాత్రమే ఈ ప్రయోజనం.
2. RBI Repo Rate- లింక్డ్ లోన్‌లకు ప్రయోజనం లేదు.


