Hero Glamour X Launched: భారతదేశ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ మార్కెట్లో తన కొత్త 2025 హీరో గ్లామర్ X 125ను విడుదల చేసింది. ఈ బైక్ లో సెగ్మెంట్-ఫస్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను అందించారు. ఇప్పటివరకు ఈ ఫీచర్ కెటిఎమ్ 390 డ్యూక్, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్310 వంటి ప్రీమియం బైక్‌లలో మాత్రమే అందుబాటులో ఉండడం విశేషం. కంపెనీ దీని బేస్ డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. అయితే టాప్-స్పెక్ డిస్క్ వేరియంట్ రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్)కి పేర్కొంది. దీని లక్షణాలను వివరంగా తెలుసుకుందాం.
ఈ కొత్త గ్లామర్ X 125 బైక్ అద్భుతమైన సాంకేతికతతో అందుబాటులో తీసుకొచ్చారు. ఇందులో కలర్ TFT డిస్ప్లే (బ్లూటూత్ కనెక్టివిటీ + టర్న్-బై-టర్న్ నావిగేషన్), USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, పూర్తి-LED లైటింగ్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Tata Cars: పంచ్ నుండి సఫారీ వరకు..ఈ టాటా కార్లపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ. లక్ష వరకు ఆదా!
ఈ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 124.7cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8,250rpm వద్ద 11.4bhp శక్తిని, 6,500rpm వద్ద 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఫలితంగా ఇప్పుడు దీని పనితీరు హీరో ఎక్స్‌ట్రీమ్ 125Rకి సమానంగా మారింది. ఈ బైక్ లో రైడ్-బై-వైర్ థ్రోటిల్, 3 రైడ్ మోడ్‌లు (ఎకో, రోడ్, పవర్) అందుబాటులో ఉన్నాయి.
ఈ బైక్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. మొదటిది డ్రమ్ వేరియంట్. ఇది మాట్ మాగ్నెటిక్ సిల్వర్, కాండీ బ్లేజింగ్ రెడ్ వంటి రంగు ఎంపికలను కలిగి ఉంది. అలాగే, రెండవది డిస్క్ వేరియంట్. ఇది మెటాలిక్ నెక్సస్ బ్లూ, బ్లాక్ టీల్ బ్లూ, బ్లాక్ పెర్ల్ రెడ్ వంటి రంగు ఎంపికలను కలిగి ఉంది. ఇప్పటికే దీని బుకింగ్ అన్ని హీరో డీలర్‌షిప్‌లు, అధికారిక వెబ్‌సైట్‌లలో ప్రారంభమైంది.


