Hero Mavrick 440 Discontinued: భారతీయ మార్కెట్లో చాలా ప్రీమియం బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. అనేక బైక్ కంపెనీ తయారీదారులు 400సిసి విభాగంలో గొప్ప ఫీచర్లతో బైక్‌లను అందిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం..హీరో మోటోకార్ప్ అందించే హీరో మావ్రిక్ 440 బైక్ నిలిపివేయబడింది. ఈ వార్త 400సిసి విభాగంలో బైక్ కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూసే అని చెప్పవచ్చు. అయితే, ఈ బైక్ నిలిపివేయడానికి గల కారణాలు, ధర, ఇంజిన్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Hero Mavrick 440 నిలిపివేయడానికి గల కారణాలు:
నివేదికల ప్రకారం.. హీరో మావ్రిక్ 440 అమ్మకాలు నిరంతరం తగ్గుతూ వచ్చాయి. దీని కారణంగా దీని అమ్మకం నిలిపివేయబడింది.
ఈ బైక్‌ను హీరో వెబ్‌సైట్ నుండి ఇంకా పూర్తిగా తొలగించనప్పటికీ, దేశవ్యాప్తంగా చాలా మంది డీలర్లు దాని బుకింగ్‌లను తీసుకోవడం ఆపివేసారు.
Hero Mavrick 440 ఇంజిన్:
కంపెనీ ఈ బైక్ లో 440 సిసి ఎయిర్ కూల్డ్ ఆయిల్ కూలర్ ఇంజిన్‌ను అందించింది. దీని కారణంగానే ఇది 20.13 kW పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌ను అందించారు. ఇది రైడర్స్ కు గేర్‌షిఫ్టింగ్‌ను సున్నితంగా, స్పోర్టీగా చేస్తుంది.
Hero Mavrick 440 ఫీచర్లు:
హీరో మావ్రిక్ 440 బైక్‌లో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను అందించింది. ఈ బైక్‌లో LED హెడ్‌లైట్, LED DRL, LED టెయిల్ లైట్లు, LED టర్న్ ఇండికేటర్, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, 175 mm గ్రౌండ్ క్లియరెన్స్, డిజిటల్ స్పీడోమీటర్ వంటివి ఉన్నాయి.
Hero Mavrick 440 ధర:
మావ్రిక్ 440 బైక్‌ను హీరో మోటోకార్ప్ మూడు వేరియంట్లలో అందిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 2 లక్షల నుండి రూ. 2.25 లక్షల మధ్య ఉంది. ఈ బైక్ మార్కెట్లో ఉన్న హార్లే డేవిడ్సన్ 440X, ట్రయంఫ్ స్పీడ్ 400, ట్రయంఫ్ స్కాంబ్లర్ 400, బజాజ్ డొమినార్ 400 వంటి బైక్‌లతో నేరుగా పోటీ పడుతోంది.


